Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గజిని సినిమాతో సూర్య తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో గజిని భారీ బ్లాక్ బాస్టర్ అందుకోవడంతో ఇక్కడ కూడా సూర్యకు ఫ్యాన్ బేస్ మొదలైంది. దీంతో అప్పటినుండి తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ సూర్య ఆకట్టుకుంటున్నాడు. ఇక ఇప్పుడు సూర్య కంగువ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. అయితే సూర్య హీరోయిన్ జ్యోతికను 2006లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాకా ఇప్పుడు వీరిద్దరూ వేరే కాపురం పెట్టినట్లు తెలుస్తోంది.
కోలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా పేరుపొందిన ఈ జంట వేరే కాపురం పెట్టడంపై బలమైన కారణాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం జ్యోతిక పిల్లలతో కలిసి ముంబైలో ఉంటున్నారట. దీంతో సూర్య ముంబై టు చెన్నై ట్రావెల్ చేస్తున్నట్లు సమాచారం. అయితే మొన్నటి వరకు చెన్నైలోనే ఉన్న ఈ జంట ఇప్పుడు వేరే కాపురం పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే జ్యోతిక ని వివాహం చేసుకోవడం సూర్య తండ్రి శివకుమార్ కు అస్సలు ఇష్టం లేదట. ఇక కొడుకు ఇష్టాన్ని కాదనలేక అప్పుడు పెళ్లి చేసినట్లు వార్తలు కూడా వినిపించాయి. అయితే పెళ్లికి ముందే శివకుమార్ జ్యోతికకు ఓ కండిషన్ పెట్టారట. ఇక ఆ కండిషన్ ఏంటంటే….
పెళ్లి తర్వాత సినిమాలో నటించకూడదు. దీనికి అంగీకరించిన జ్యోతిక పెళ్లి అనంతరం కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇప్పుడు జ్యోతిక తిరిగి సినిమాల్లో చేయడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో కుటుంబంలో కాస్త గొడవలు చోటు చేసుకున్నాయని సమాచారం. జ్యోతిక సినిమాలో చేయడం తన మామయ్య శివకుమా ర్ జీర్ణించుకోలేకపోయాడు. దీంతో అత్తమామలతో కాకుండా జ్యోతిగా వేరే ఉండాలని నిర్ణయం తీసుకుందని తమిళ్ మీడియాలో వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఈ కారణంగానే ప్రస్తుతం జ్యోతిక పిల్లలతో కలిసి ముంబైలో ఉంటుండగా, రెండు వైపులా ఉన్న సూర్య ముంబై టు చెన్నై ట్రావెల్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇది ఇలా ఉంటే ఎంతో అన్యోన్యంగా ఉంటున్న కుటుంబం విడిపోవడానికి జ్యోతికనే ప్రధాన కారణమని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. మరికొందరు మాత్రం పిల్లల చదువు నిమిత్తం జ్యోతిక ముంబై వెళ్ళినట్లుగా చెబుతున్నారు. వారి మధ్య ఎలాంటి గొడవలు రాలేదని పిల్లలు పెద్ద వాళ్ళు అవుతుండడంతో ముంబైలో చదువుల కోసం వెళ్లారని ,దీంతో సూర్య చెన్నై టు ముంబై తిరుగుతున్నారని కొందరు అంటున్నారు. అయితే ఇలా రెండు విధాలుగా వినిపిస్తున్న వార్తల లో నిజం ఎంతుందో తెలియాలంటే ఈ విషయంపై సూర్య జ్యోతిక స్పందించాల్సిందే.