Vishnu Priya : బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మొదట సుడిగాలి సుదీర్ తో కలిసి ” పోవే పోరా ” షోలో యాంకరింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై అనేక రకాల షోలలో కనిపించి అలరించింది. సడన్ గా ఏమైందో తెలియదు కానీ ఈ ముద్దుగుమ్మకు బుల్లితెరపై యాంకరింగ్ అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఒకప్పుడు ఈటీవీ నిర్వహించే ప్రతి షో లో కనిపించి సందడి చేసే విష్ణు ప్రియ ఇప్పుడు అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగే కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల సీరియల్ నటుడు మానస్ తో కలిసి ఒక ప్రైవేట్ ఆల్బమ్ కూడా చేసింది. ఇక ఈ ఆల్బమ్ కూడా సూపర్ హిట్ అవడంతో విష్ణు ప్రియ కు మంచి క్రేజ్ వచ్చింది.
ఇలా అప్పుడప్పుడు సినిమా లో నటిస్తూ ఇటీవల సుడిగాలి సుదీర్ తో కలిసి వాంటెడ్ పండుగాడు సినిమాలో కూడా నటించింది విష్ణుప్రియ.అయితే కే రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు అడపాదడపా వచ్చే సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయని చెప్పాలి. ఈ క్రమంలో ఇటీవల జెడి చక్రవర్తితో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించిన విష్ణు ప్రియ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. తన లైఫ్ స్టైల్ ను తాను చేసే పనులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదిక అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది. ఇక గ్లామర్ షో కి ఏ మాత్రం వెనకడుగు వేయని విష్ణుప్రియ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇటీవల షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలోని “రామయ్య వస్తావయ్య” అనే పాటకి టైట్ జీన్స్ లో అదిరిపోయే స్టెప్పులు వేసింది. నడుము అందాలు కనిపించేలా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగానే క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నేటి జనులు పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. డాన్స్ అదుర్స్ అని కొందరు కామెంట్స్ చేస్తుంటే , ఏమన్నా డాన్స్ చేసావా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతం సినీ అవకాశాల కోసం విష్ణు ప్రియ సోషల్ మీడియాని మాత్రం చాలా గట్టిగానే వాడుతుంది. ఈ నేపథ్యంలోనే విష్ణు ప్రియా తన హాట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ అప్పుడప్పుడు డాన్స్ వీడియోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
View this post on Instagram