Hair Growth : ప్రస్తుతం చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం మన దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్యం. అలాగే మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం వలన కూడా జుట్టు రాలే సమస్యలు ఎక్కువవుతున్నాయి. కేవలం ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే జుట్టు పెరగడానికి వివిధ రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తూ, బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ డబ్బులను వృధా చేస్తూ ఉంటారు. అయితే అలాంటి వారికి ఇంట్లో ఉండే ఇంగ్రిడియంట్స్ తో ఒక రెమెడీని తయారు చేసుకొని వాడినట్లయితే జుట్టు కొద్ది రోజుల్లోనే పెరుగుతుంది.
ఈ ఒక్క ఆయిల్ తయారు చేసుకుని ఇంట్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు వస్తుంది. ఈ ఆయిల్ తో జుట్టు చాలా ఈజీగా పెరుగుతుంది ఎందుకంటే ఇందులో వాడే ఇంగ్రిడియంట్స్ అన్ని కూడా చాలా పవర్ఫుల్. అంతేకాకుండా ఇవి మీకు అందుబాటులో ఉండేటివే.కోల్పోయిన జుట్టు తిరిగి పొందడమే కాకుండా దృఢంగా, బలంగా, ఆరోగ్యంగా మీ జుట్టు పెరుగుతుంది. ఈ రెమిడిని తయారు చేసుకోవడానికి ఎంతో సమయం కూడా పట్టదు. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో పావు లీటర్ వరకు కొబ్బరి నూనె పోసుకోవాలి. తర్వాత అందులో ఒక స్పూన్ మెంతులు, మూడు తమలపాకులు, గుప్పెడు కరివేపాకు, ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. గోల్డ్ కలర్ లోకి వచ్చేదాకా వీటిని నూనెలో వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత స్టైనర్ సహాయంతో ఒక గాజు సీసాలోకి వడకట్టుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న ఆయిల్ ని ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు. ప్రతిరోజు కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ వాడినట్లయితే జుట్టు వద్దన్నా పెరుగుతుంది. ఇందులో వాడిన తమలపాకులు జుట్టుకు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో వాడుతారు. ఇది జుట్టును ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది. ఇక కరివేపాకు జుట్టుకు ఎంత మేలు చేస్తున్న అందరికీ తెలిసిందే. ఇందులో వాడినవన్నీ జుట్టు దృఢంగా, బలంగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈ ఆయిల్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకే ఈ ఆయిల్ ను చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరూ వినియోగించవచ్చు.