Shruti Haasan : ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఒక అరుదైన వ్యాధి వచ్చిన విషయం తెలుసు కదా. తనకు వచ్చిన వ్యాధి వల్ల తన కెరీర్ కు ఒక్కసారిగా బ్రేక్ వచ్చింది. ప్రస్తుతం తన వ్యాధికి సమంత చికిత్స తీసుకుంటోంది. ఈనేపథ్యంలో మరో స్టార్ హీరోయిన్ అయిన శృతి హాసన్ కు కూడా సమంతలా అరుదైన వ్యాధి వచ్చిందని నెటిజన్లు అంటున్నారు. దానికి కారణం.. తను లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలే కారణం. కానీ.. తనకు అంత పెద్ద వ్యాధి ఏం రాలేదని.. తను వచ్చిన వ్యాధి గురించి మాత్రం శృతి హాసనే ఫోటోలతో సహా ఇన్ స్టాలో షేర్ చేసింది.

తను షేర్ చేసిన ఫోటోలు చూస్తే.. ఆ ఫోటోలలో శృతి హాసన్ ముఖం ఉబ్బిపోయి ఉంది. కళ్లు కూడా ఉబ్బిపోయాయి. పెదాలు కూడా వాచిపోయాయి. అయితే.. శృతి హాసన్ కు సైనస్ ప్రాబ్లమ్ ఉంది. అసలే చలికాలం కావడంతో తనకు సైనస్ ప్రాబ్లమ్ ఎక్కువైందట. దాని వల్ల తన ముఖం మొత్తం వాచిపోయిందట. అలాగే తనకు జ్వరం కూడా వచ్చిందట. పీరియడ్స్ వల్ల కూడా తనకు పలు సమస్యలు వచ్చాయని.. మొత్తానికి తన ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని.. చాలా వీర్డ్ గా కనిపిస్తున్నానని శృతి హాసన్ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది.
Shruti Haasan : చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్న శృతి
నిజానికి శృతి హాసన్ కెరీర్ కు మధ్యలో బ్రేక్ వచ్చింది. కొన్నేళ్ల పాటు తను సినిమాల్లో కనిపించలేదు. కోవిడ్ తర్వాత క్రాక్ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాలో నటిస్తోంది శృతి హాసన్. బాలకృష్ణ 107 వ సినిమాలోనూ శృతి హాసన్ నటిస్తోంది. చిరంజీవి సినిమాలోనూ తను హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ప్రస్తుతం సలార్ షూటింగ్ లో శృతి హాసన్ పాల్గొంటోంది. మరోవైపు శృతి హాసన్.. శంతనుని హజారికా అనే వ్యక్తితో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తన ముఖం ఎర్రగా కందిపోవడంతో తన ఫోటోలను చూసి నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. తమ అభిమాన తార త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.