Disha Patani : దిశా పటానీ తెలుసు కదా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తను. తను ఎంత ఫిట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనది చూపు తిప్పుకోలేని అందం. తను బాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కూడా తను ఏమాత్రం ఫిట్ నెస్ ను వదల్లేదు. ఫిట్ నెస్ మీద తను పెట్టే దృష్టి మామూలుగా ఉండదు. ఏ సినీ ఇండస్ట్రీలో అయినా దిశా పటానీకి ఉన్న ఫిగర్ ఏ హీరోయిన్ కు లేదు అంటే అతిశయోక్తి కాదు.
నిజానికి హీరోయిన్స్ అంటేనే జీరో సైజ్ మెయిన్ టెన్ చేస్తారు. అలా బాడీని కూడా పర్ ఫెక్ట్ షేప్ లో ఉంచుకుంటారు. కానీ.. కొందరు మాత్రం తిండిని కంట్రోల్ చేసుకోలేక, కసరత్తులు చేయలేక ఫిట్ నెస్ ను కోల్పోతారు. కొందరు హీరోయిన్లు లావెక్కుతారు. కానీ.. దిశా మాత్రం తను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. తను ఫిట్ నెస్ ను మాత్రం అస్సలు కోల్పోలేదు.
Disha Patani : దిశా హైలెగ్ కిక్స్ చూస్తే వావ్ అనాల్సిందే
సోషల్ మీడియాలో దిశ చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఓ ఫీట్ ను చేసి దాన్ని తన ఇన్ స్టాలో షేర్ చేసింది. సినిమా హీరోలు కాదు కదా.. ఎటువంటి స్టంట్స్ చేసేవాళ్లు కూడా ఇలాంటి సాహసాలు చేయలేరు. హై లెగ్ కిక్స్ చేసి ఆ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది దిశా పటానీ. తన కిక్స్ ను చూసి నెటిజన్లు మాత్రం నోరెళ్లబెడుతున్నారు. వావ్ అంటున్నారు. ఏంటి దిశా.. నువ్వు, నీ ఫిట్ నెస్ లేవల్స్ కు హేట్సాఫ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.