Jabardasth : అనసూయ వెళ్లిపోయాక జబర్దస్త్ యాంకర్ చాన్స్ ను రిజెక్ట్ చేసిన టాప్ యాంకర్స్ ఎవరో తెలుసా?

Jabardasth : జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు బుల్లితెర మీదనే అది మొట్టమొదటి కామెడీ షో. అది సూపర్ సక్సెస్ అయింది. దీంతో ఎక్స్ ట్రా జబర్దస్త్ ను కూడా స్టార్ట్ చేశారు. జబర్దస్త్ స్టార్ట్ అయి 10 ఏళ్లు దాటినా ఇప్పటి వరకు ఆ షోను ఢీకొట్టే మరో షో రాలేదు. అయితే గత కొన్ని రోజుల నుంచి జబర్దస్త్ షో మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. జబర్దస్త్ నుంచి చాలామంది కంటెస్టెంట్లు మానేసి వెళ్లిపోవడం, కిరాక్ ఆర్పీ కూడా జబర్దస్త్ యాజమాన్యంపై ఆరోపణలు చేయడం చర్చనీయాంశం అయ్యాయి. జడ్జిలు కూడా వెళ్లిపోవడం, చివరకు యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ ను వీడి వెళ్లిపోవడంతో ఒక్కసారిగా జబర్దస్త్ గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

why top anchors rejected jabardasth as anchor
why top anchors rejected jabardasth as anchor

అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో తన స్థానంలో స్టార్ యాంకర్ ను ఎవరినైనా తీసుకోవాలని మల్లెమాల యాజమాన్యం యోచించిందట. అందు కోసం చాలామంది టాప్ యాంకర్లను వాళ్లు సంప్రదించారట. కానీ.. ఎవరు కూడా జబర్దస్త్ యాంకర్ గా చేయమని తేల్చి చెప్పేశారట. అందరూ రిజెక్ట్ చేశారట.

Jabardasth : ఈ మధ్య జబర్దస్త్ రేటింగ్ పడిపోయిందా?

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన జబర్దస్త్ షో రేటింగ్స్ ఇప్పుడు చాలా పడిపోయాయి అనే టాక్ వినిపిస్తోంది. దానికి కారణం ఏంటి అనేది పక్కన పెడితే ఒకప్పుడు దాని రేటింగ్ 20 ఉండేదట. ఇప్పుడు 10 కూడా ఉండటం లేద. టాప్ కమెడియన్స్ వెళ్లిపోవడంతో పాటు యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ ను వీడటంతోనే ఒక్కసారిగా జబర్దస్త్ రేటింగ్ పడిపోయిందనే వార్తలు వస్తున్నాయి.

అందరు కంటెస్టెంట్లకు పారితోషికాన్ని తగ్గించడంతోనే జబర్దస్త్ ను వీడి చాలామంది వెళ్లిపోయినట్టు వార్తలు వచ్చినా.. అనసూయ ఎందుకు వెళ్లిపోయిందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.

అనసూయ వెళ్లిపోతే తన స్థానంలో యాంకర్ గా తీసుకునేందుకు మరో యాంకర్ శ్రీముఖిని మల్లెమాల యాజమాన్యం సంప్రదించిందట. నిజానికి శ్రీముఖికి 2013 లోనే అంటే జబర్దస్త్ ప్రారంభమైన సమయంలోనే శ్రీముఖికి యాంకర్ గా చాన్స్ వచ్చింది కానీ.. తను అప్పుడు ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసింది. ఇప్పుడు కూడా శ్రీముఖిని సంప్రదించారట. కానీ.. ఆమె ఈసారి కూడా ఒప్పుకోలేదట. శ్రీముఖి తర్వాత మరికొందరు స్టార్ యాంకర్లను కూడా సంప్రదించినా ఎవ్వరూ ఒప్పుకోలేదట. దీంతో చేసేది లేక మళ్లీ ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీనే జబర్దస్త్ కు యాంకర్ గా పెట్టేశారు.