Niharika : సాధారణంగా పెళ్లి చేయాలంటే చాలా కష్టమని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అలా చేసిన వాళ్ళకి దానిలో పెయిన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అయితే అమ్మాయి జీవితంలో చాలా తల నొప్పులు ఉంటాయి. ఒక అబ్బాయిని అనుకోని మరొక అబ్బాయిని చేసుకున్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు. అయితే సినీ పరిశ్రమలో కూడా అలాంటి స్టార్ట్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల మెగా డాటర్ నిహారిక చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరి పెళ్ళిని ఎంతో ఘనంగా జరిపించారు నాగబాబు. అయితే పెళ్లి తర్వాత నిహారిక తన పోటోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే నిహారికని ఓ యంగ్ హీరో పెళ్లి చేసుకోవాలనుకున్నాడట. ఆమెతో కలిసి సినిమా చేసిన ఈ యంగ్ హీరో ఆమెకి తొలి చూపులోనే నచ్చిందట. నిహారిక కి అలాంటి ఆలోచన లేకపోయినా వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. త్వరలోనే యంగ్ హీరో మెగా ఇంటికి అల్లుడు అవుతాడని వార్తలు వినిపించాయి. ఆ సమయంలో వీరిద్దరూ నిజంగానే పెళ్ళి చేసుకుంటారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
Niharika : ఆ యంగ్ హీరో నిహారికను పెళ్లి చేసుకోవాలనుకున్నాడట…
దీంతో నాగబాబు ఈ విషయంలోకి దూరి అలాంటిది ఏదీ లేదా నిహారికకు అప్పుడే పెళ్లి చేసే ఆలోచన లేదని ఆ సమయంలో చెప్పుకొచ్చాడు. అంతేకాదు మరోసారి ఆ యంగ్ హీరోతో నటించకుండా నిహారికను దూరం చేశారు. ఇలా సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు వార్తలు రావడంతో నిహారికపై లేనిపోని ట్రోల్స్ చేశారు కొందరు. ప్రస్తుతం నిహారిక తన భర్త చైతన్యతో తన మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. అడపా దడపా సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతుంది.