Viral Video : సాధారణంగా మనం పాములను పెంచుకోం. కుక్క, పిల్లి లాంటి వాటిని ఇంట్లో పెంచుకుంటాం. కానీ.. పాములను పెంచుకునే వాళ్లను ఎక్కడా చూసి ఉండరు. ఎవరి ఇంట్లో కూడా పాము ఉండదు. కుక్కలు, పిల్లలు, లేదా ఏవైనా పక్షులను పెంచుకుంటారు. కానీ.. పాములను మాత్రం ఎవ్వరూ పెంచుకోరు.
అయితే.. కొందరు మాత్రం పులులు, సింహాలను కూడా పెంచుకుంటూ ఉంటారు కానీ.. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాటిని తెచ్చుకొని పెంచుకుంటారు కాబట్టి అవి ఎలాంటి హానీ తలపెట్టవు. కానీ.. పాములు అలా కాదు. ఎంత పాలు పోసి పెంచినా పాము విషమే చిమ్ముతుంది అని అంటుంటారు. పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు.
Viral Video : విషపూరితమైన పాముల జోలికి అస్సలు పోకూడదు
పాముల్లోనూ చాలా రకాలు ఉంటాయి. కొన్ని విషపూరితమైన పాములు కూడా ఉంటాయి. కోబ్రా, ర్యాటిల్ స్నేక్ లాంటి పాములు చాలా డేంజర్. వాటి జోలికి అస్సలు పోకూడదు. పోయామంటే ఇక అంతే. కానీ.. ఒక చిన్నారి మాత్రం పాములంటే అస్సలు భయం లేదు అన్నట్టుగా ప్రవర్తించింది. పాముతోనే ఆటాడుకుంది. పామును హగ్ చేసుకొని బెడ్ మీద పడుకుంది. అది కూడా మామూలు పాము కాదు.. భారీ కొండచిలువ. అసలు.. కొండచిలువను చూస్తేనే జడుసుకుంటాం. అలాంటిది ఆ చిన్నారి పామును హగ్ చేసుకొని పడుకోవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియోను ఓ ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. అసలు.. పామును హత్తుకోవడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ ఆ చిన్నారి పామును పెంచుకుంటుందేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఆ చిన్నారి పామును హగ్ చేసుకొని పడుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.