Siddhu Jonnalagadda : అయ్యయ్యో.. పాపం సిద్దు జొన్నలగడ్డ… ఆ బ్యూటీ ఆకాశం చూపించి నేల నాకించేసిందిగా…

Siddhu Jonnalagadda : హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క సినిమాతో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. అంతకుముందు చిన్నా చితక పాత్రలు చేసిన కొన్ని సినిమాల్లో నటించిన అసలైన పేరు కూడా ఎవరికీ తెలియకుండా ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలీదు. అలాంటిది సిద్దు జొన్నలగడ్డ ఒక్క సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చాడు. అయితే సిద్దు జొన్నలగడ్డకి ప్రస్తుతం బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది. ఇప్పుడు అలాంటిది సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. అయితే డీజే టిల్లు సినిమాతో సిద్దు తన లైఫ్ ని మార్చేసుకున్నాడు.

డీజే టిల్లు సినిమాలో సిద్దు నటనను చూసి అందరూ జూనియర్ విజయ్ దేవరకొండ అంటూ ట్యాగ్ కూడా ఇచ్చారు. అంతలా తన హాట్ పెర్ఫార్మెన్స్ తో యూత్ ని అట్రాక్ట్ చేసుకున్నాడు. అయితే డీజే టిల్లు భారీగా హిట్ కావడంతో డీజే టిల్లుకి సీక్వెల్ గా డీజే టిల్లు 2 తీయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకున్నారు. అయితే డీజే టిల్లు లో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి ఈ సినిమాలో నటించదు అంటూ ముందుగానే చెప్పేశారు.

Siddhu Jonnalagadda : అయ్యయ్యో.. పాపం సిద్దు జొన్నలగడ్డ…

Young heroin cheated hero siddhu jonnalagadda
Young heroin cheated hero siddhu jonnalagadda

అయితే ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనిపై మేకర్స్ కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడంతో ఇది నిజమే అని అనుకుంటున్నారు. అంతేకాకుండా యంగ్ బ్యూటీ శ్రీ లీల ఈ సినిమాలో నటిస్తే సిద్దు కి ఇక తిరుగు ఉండదు అనుకుంటున్నారు. అయితే రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి శ్రీ లీల అవుట్ అయినట్లు తెలుస్తుంది. సిద్దు జొన్నలగడ్డ లాంటి హీరోతో నటిస్తే తన కెరీర్ ఏమవుతుందో అని శ్రీ లీల ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. దీంతో కొందరు నెటిజన్లు జొన్నలు సిద్దు జొన్నలగడ్డని ట్రోల్ చేస్తున్నారు. అయ్యయ్యో పాపం సిద్దు ఆ హీరోయిన్ ఆకాశం చూపించి నేల నాకించేసిందిగా ఇక పడుకో అట్టు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.