Rice Flakes : చాలా సులువుగా తయారు చేసుకునే స్నాక్స్ లో అటుకులు ఒకటి అని చెప్పాలి. ఇక వీటిని పొహ పాలలో కలిపి తినడం మరియు దోశ ఇడ్లి వంటి వాటిలో కూడా వాడతారు. అంతేకాక వీటిని దేవునికి నైవేద్యంగా కూడా సమర్పిస్తుంటారు. అయితే వీటిని తీసుకోవడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ అవి ఏమీ తెలియకుండానే మనం ఎన్నో రోజులుగా వీటిని తింటూ వస్తున్నాం. అయితే వీటిలో ఎలాంటి పోషకాలు ఉన్నాయో వాటి వలన మనకు కలిగే లాభాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం
పోషకాలు….
అటుకులలో ఫైబర్ కంటెంట్ ,ఐరన్ కంటెంట్, పొటాషియం వంటి వివిధ రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇక ఈ పోషకాలు శరీరానికి శక్తిని ఇవ్వడానికి మరియు కొలెస్ట్రాలను కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. అలాగే ఇది ఇన్సులిన్ మోతాదు ను కూడా నిర్ధారిస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించాలి అనుకునే వారికి అటుకులు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అలాగే శరీరానికి కావాల్సిన అత్యుత్తమ పోషకాలలో కార్బోహైడ్రేట్స్ ఒకటి. ఇక ఈ కార్బోహైడ్రేట్స్ అటుకులలో సమృద్ధిగా లభిస్తాయి. ఇది మన శరీర శక్తి స్థాయిలను పెంచి సైడ్ ఎఫెక్ట్స్ నుండి శరీరాన్ని కాపాడుతుంది.
బరువు తగ్గేందుకు….
అటుకులలో కార్బోహైడ్రేట్స్ శాతం ఎక్కువగా ఉండటం వలన ఇది బాడీ వెయిట్ బ్యాలెన్స్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది ఒక మంచి ఆహారం. అలాగే దీనిని ప్రతిరోజు ఉదయాన్నేే తినడం వలన బరువు తగ్గడంతో పాటు జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. తద్వారా మీరు మీ బరువును కంట్రోల్లో ఉంచుకోగలుగుతారు.
ఎలా తీసుకోవాలి….
పోహా తిన్నప్పుడు అది త్వరగా జీర్ణం అవడం కష్టమే. అది చాలాసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. అదేవిధంగా దీనిని కూడా పోహ లాగా చేసుకుని తింటే మంచి ఫలితాలు ఉంటాయి. అంటే దీనిలో కూరగాయలు పల్లీలు బాటనీలు ఎక్కువగా వేసుకుని తినాలన్నమాట. అంతేకాక అటుకులతో పాలు పెరుగు కూడా కలుపుకుని తినవచ్చు. ఈ విధంగా అటుకులను తీసుకోవడం వలన ఇట్టే బరువు తగ్గుతారు. అయితే శరీరానికి మించి కాకుండా తక్కువ పరిమాణంలో తీసుకుంటే మంచిది.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని మీ అవగాహన మీరకు ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించాం.యువతరం దీనిని ధ్రువీకరించలేదు.