Hair Growth : అద్భుతమైన హెయిర్ ప్యాక్.. ఊడిన ప్రతి వెంట్రుక వస్తుంది..

Hair Growth  : ప్రస్తుతం మారిన జీవన శైలి కారణంగా చాలామంది జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే జుట్టు రాలే సమస్యలను తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే వివిధ రకాల ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తున్నారు. వీటి వలన ఎటువంటి ఫలితం ఉండదు. అంతేకాకుండా వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇంట్లోనే దొరికే పదార్థాలతో ఈజీగా రెమిడిని తయారు చేసుకోవచ్చు. ఈ రెమిడిని జుట్టుకు పట్టిస్తే ఊడిన ప్రతి వెంట్రుక వస్తుంది. ఈ రెమిడీ అన్ని రకాల హెయిర్ టైప్స్ వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. ఎంత పవర్ఫుల్ అంటే శరీర తత్వం ఎలా ఉన్నా సరే ఎటువంటి ఆహారం తీసుకున్న సరే ఎలాంటి ఆహార పదార్థాలు పడకపోయినా సరే ఈ రెమిడి అప్లై చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

10 Natural Remedies to Stop Hair Fall

ఈ రెమెడీకి కావలసిన పదార్థాలు : గోరింటాకు, మందార ఆకులు, రేగు ఆకులు, పెరుగు

ముందుగా ఒక గిన్నెలో గుప్పెడు గోరింటాకు తీసుకొని శుభ్రంగా నీళ్లతో కడిగి మిక్సీ జార్ లో వేసుకోవాలి. తర్వాత ఇందులో గుప్పెడు మందార ఆకులు శుభ్రంగా కడిగి వేయాలి. అలాగే గుప్పెడు రేగు ఆకులు వేయాలి. ఈ రేగు ఆకులు జుట్టుకి చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. రేగి ఆకులను సీజర్ తో కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేయాలి. ఇక చివర్లో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. తెలుగు లేకపోతే నిమ్మకాయ రసం అయినా వేసుకోవచ్చు. తర్వాత ఈ పదార్థాలన్నింటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ రెమెడీని జుట్టు మొత్తానికి అప్లై చేసి 45 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా నెలకి 4,5 సార్లు ఈ హెయిర్ ప్యాక్ ను అప్లై చేస్తే జుట్టు కొద్దిరోజుల్లోనే ఊడిన చోట ప్రతి వెంట్రుక మొలుస్తుంది. ఇక ఈ హెయిర్ ప్యాక్ ను అన్ని వయసుల వారు వినియోగించవచ్చు. ఇందులో వినియోగించినవన్నీ ప్రకృతిలో దొరికే పదార్థాలు కాబట్టే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు ఈ హెయిర్ ప్యాక్ ను ట్రై చేయవచ్చు రిజల్ట్ చూసి మళ్లీ మళ్లీ ట్రై చేస్తారు.