Rajeev Kanakala : బాబు అరెస్టుపై ఎన్టీఆర్ స్పందించకపోవడానికి కారణం ఇదే…స్పష్టం చేసిన రాజు కనకాల…

Rajeev Kanakala : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు అయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ పై టిడిపి నాయకులు మరియు అభిమానులు విమర్శలు చేస్తూ చంద్రబాబును అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు చంద్రబాబు అరెస్టుపై స్పందించగా…నందమూరి కుటుంబమైన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటికీి స్పందించకపోవడం చర్చనియాంశంగా మారింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గతంలో టిడిపి పార్టీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అంత చేసినప్పటికీ ఇప్పుడు చంద్రబాబు అరెస్టు ఎన్టీఆర్ స్పందించకపోవడంతో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. మరి కొందరు మాత్రం ఎన్టీఆర్ కు మద్దతుగాా నిలుస్తున్నారు.

Advertisement

this-is-the-reason-why-ntr-did-not-respond-to-babus-arrest-raju-kanakala-clarified

Advertisement

ఈ నేపథ్యంలోనే పలువురు ఎన్టీఆర్ ఎందుకు స్పందించట్లేదని విషయంపై వ్యాఖ్యానిస్తున్నారు. అయితే తాజాగా చంద్రబాబు అరెస్టుపై ఎన్టీఆర్ మౌనంగా ఉండడానికి గల కారణం ఏంటి అనేది ఎన్టీఆర్ ప్రాణ స్నేహితుడు రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన రాజీవ్ కనకాల చంద్రబాబు అరెస్టుపై ఎన్టీఆర్ మౌనం గురించి స్పందించారు. ఇక ఈ ప్రశ్నను యాంకర్ అడుగగా రాజీవ్ కనకాల సమాధానం ఇస్తూ….అతనికి రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంటే అతనే చెప్తాడు.గతంలో కూడా పార్టీ ప్రచారం చేశాడు తన మాటలతో అందరినీ ఉర్రూతలూగించాడు. కానీ ఇప్పుడు అతనికి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు.

this-is-the-reason-why-ntr-did-not-respond-to-babus-arrest-raju-kanakala-clarified

మరో ఐదు సంవత్సరాల తర్వాత ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉందేమో.ప్రస్తుతానికి తన ఫోకస్ అంతా సినిమాల పైన తన కెరియర్ పైన పెట్టాడని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు . అలాగే ఎన్టీఆర్ పై చాలామంది నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారని అయిన అతను ఎందుకు మౌనంగా ఉన్నాడనేది కచ్చితంగా తెలియదంటూ మాట్లాడారు. అలాగే కరోనా వలన ఆర్ఆర్ఆర్ సినిమా వలన నాలుగు సంవత్సరాల టైం పోయింది. లేకపోతే ఈ గ్యాప్ లో మరో మూడు సినిమాలు తీసేవాడు. ఇక ఇప్పుడు దేవర సినిమాలో చాలా బిజీగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కు నటన అంటే ప్రాణం.

 

ఈ ఇప్పుడు సినిమాల పైన ఫోకస్ చేయడం బిజీగా ఉండటం వల్లనే స్పందించట్లేదేమో అని , అతను రావాలనుకుంటే మాత్రం రాజకీయాలు నేర్చుకుని మరి వస్తాడని రాజీవ్ కనకాల స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు పార్టీ పరంగా విమర్శలు చేయడం వేరు కానీ ఇప్పుడు అందరూ తిట్టుకోవడమే సరిపోతుంది. అది కరెక్ట్ కాదు అంటూ రాజీవ్ కనకాల వ్యాఖ్యానించారు. దీంతో ప్రస్తుతం రాజీవ్ కనకాల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఎప్పటికైనా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారు అనే విషయాన్ని రాజీవ్ కనకాల ఇన్ డైరెక్ట్ గా చెప్పడంతో ఈ విషయంపై ఇప్పుడు చర్చ మొదలైంది.

Advertisement