Guava Side Effects : జామపండు అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అన్ని సీజన్లో లభించే ఈ పండు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది. అయితే దీనివల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఎక్కువేని చెప్పవచ్చు. ఈ పండులో ప్రోటీన్, విటమిన్ ,ఫైబర్ ,పొటాషియం ,యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే జామ పండు తినడం వల్ల కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయో.. ఎక్కువగా తినడం వల్ల అనర్ధాలు కూడా అంతే ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు జామపండును తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు…
జామ పండులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ ను మెరుగుపరుస్తుంది. అయితే అతిగా జామ పండు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పై చెడి ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జలుబు ,దగ్గు తో బాధపడుతున్న వారు కూడా ఈ పండ్లకు దూరంగా ఉండటమే మంచిది. దీనివల్ల జలుబు ప్రభావం అధికమవుతుంది. రాత్రి పడుకునే ముందు జామకాయ తింటే జలుబు మరింత పెరిగే అవకాశం ఉంది.
Guava Side Effects : అయితే తస్మాత్ జాగ్రత్త….
కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతున్న వారు జామ పండ్లు తినకూడదు. ఇందులో ఉండే విటమిన్ సి, ప్రక్టోజ్ కారణంగా తినగానే కడుపు ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. దీంతో కడుపు ఉబ్బరం అధికమవుతుంది.
షుగర్ పేషెంట్లు కూడా జామ పండ్లను తినకూడదు. జామ లో ఉండే చక్కెర వల్ల దుష్ప్రభావం ఏర్పడుతుంది. అయితే పరిమితంగా తీసుకుంటే మంచిదే.