Health Tips : ఈ రోజుల్లో చాలామందికి పాలు తాగే అలవాటు ఉంటుంది. రోజువారి ఆహారంలో మనం పాలని తీసుకుంటాం. మనదేశంలో చాలామంది గేదె , ఆవు పాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాలలో ఒంటె పాలన తీసుకుంటారు. మరికొన్నిచోట్ల మేకపాలను త్రాగుతారు. పాలల్లో ఎక్కువగా పోషకాలు ఉండడం వల్ల మనిషికి అవసరమైన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. పాలల్లో ఆరోగ్య విషయాలను గురించి ఆయుర్వేద ప్రొఫెసర్ తెలియజేశారు. పాల విషయంలో అనేక ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. 40 సంవత్సరాలుగా ఆయుర్వేద చికిత్స అందిస్తున్న ఆయన తెలిపిన విషయాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. పాలు మానవ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందజేస్తాయి. ఇది మీరు తాగే జంతువుల పై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. మేక ,ఆవు, గేదె ఉంటే మొదలైన జంతువులను బట్టి వాటి పాల లక్షణాలు భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు ఆవు పాలు గురించి తెలుసుకుందాం.
పాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..
రెగ్యులర్ గా పాలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి అధికమవుతుంది. తద్వారా ఎటువంటి ఇన్ఫెక్షన్లైనా ఎదుర్కొనే శక్తి ని అందిస్తుంది.
పాలల్లో ఐరన్ అధికంగా ఉండడం వల్ల శరీరానికి సరిపడా ఐరన్ అందుతుంది. ఈ కారణంగా రక్తం లేని సమస్యలు, రక్త సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.
రోజు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల శరీరానికి అవసరమైన అంత కాల్షియం అంది ఎముకలకు సంబంధించిన వ్యాధులను దూరం చేస్తుంది.
ఆవు పాలు తాగడం వల్ల శరీరానికి ఎటువంటి కొవ్వు చేరదు. శరీరం స్లిమ్ గా, ఫిట్ గా ఉంటుంది. రోజు పాలు తాగడం వల్ల శరీరంలో విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సోరియాసిస్, ఎగ్జిమా, ఇతర ఇన్ఫెక్షన్ల వంటి చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది. క్రమం తప్పకుండా పాలు తీసుకునే వారికి ఎటువంటి వ్యాధులు దరిచేరవు.
Health Tips : ఆయుర్వేద వైద్యులు ఏం చెప్తున్నారంటే.
ఏ వయసు వారు పాలు తాగాలి?
ప్రతి వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి మరణాంతరం వరకు పాలను తీసుకోవచ్చు. ఆవు పాలు బాల్యంలో శరీర ఎదుగుదలకు, మానసిక అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. పెద్ద వయసు వారికి జ్ఞాపకశక్తిని అందిస్తుంది. పూర్వంలో ప్రజలు నిండు నూరేళ్లు జీవించడానికి ఇది ఒక కారణం అని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ప్రస్తుతం ఉన్న వృద్ధుల్లో పల్లెల వారికి ఇప్పటికీ ఆల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తి సంబంధిత వ్యాధులు లేవు.
పాలు తాగితే ఎవరికీ ఇబ్బందులు..?
విరోచనాలు, ఉదర సంబంధిత సమస్యలు ఉన్నవారును పాలను తీసుకోకూడదు. ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు పాలు తాగితే… కడుపులో గ్యాస్ సమస్య మరింత పెరుగుతుంది.
పాలని ఇష్టపడని పిల్లలకు ఏమి ఇవ్వాలి?
పాలు తాగడానికి కొంతమంది చిన్న పిల్లలు ఇష్టపడరు. ఇటువంటి పిల్లలకు తల్లిదండ్రులు పాలతో కలిపి తేనెను అందించవచ్చు. పాలు, తేనె ఆయుర్వేదంలో సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు.
పాలు ఏ సమయంలో తీసుకోవాలి..?
ఆహారం తిన్న రెండు గంటల తర్వాత పాలని తీసుకోవచ్చు. అలా కాకుండా పాలు తాగిన తర్వాత ఆహారం తినాలనుకుంటే మాత్రం… ఒక గంట తర్వాత తినాలి. ఇలా ఇలా చేసినట్లయితే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. శరీరానికి అవసరమైన పోషకాలని అందుతాయి.
పాలు ఎవరు తాగొచ్చు
పిల్లల నుండి పెద్దల వరకు అన్ని వయసుల వారు పాలు తాగవచ్చు. మానసిక, శారీరక పని చేసే వారందరికీ పాలు ఎంతో అవసరం. ఎందుకంటే ఇది మెదడు ప్రశాంతంగా, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటం తో పాటు, సంతోషంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆరోగ్యం అంతమైనా జీవితానికి పాలు ఎంతో అవసరం.
ఈ సమస్యలతో బాధపడేవారు పాలు తాగొద్దు…
విరోచనాలు, లూజ్ మోషన్ సమస్య ఉంటే పాలు తాగకూడదు. పీరియడ్స్ సమయంలో పాలు తీసుకోకూడదు. కాలేయం సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు పాలకి దూరంగా ఉండడం మంచిది. బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే పాలని తాగకూడదు. అలాగే శరీరంలో వాపు సమస్య ఉన్నవారు కూడా పాలని తీసుకోకూడదు