Guppedantha Manasu 18 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 18-September-2022 ఎపిసోడ్ 558 ముందుగా మీకోసం. వసుధార, రిషి వెళ్ళిపోయాక గదిలో కూర్చుని చాలా బాధ పడుతోంది, రిషి సార్ ది అసలే సున్నితమైన మనసు, ఇప్పుడు మనసులో ఎన్ని ప్రశ్నలు వచ్చుంటాయో, నన్నపార్థం చేసుకున్నాడో ఏమో అని ఆలోచిస్తూ ఉంటుంది.ఇంతలో దేవయాని వస్తుంది, వసుధారతో చులకనగా మాట్లాడుతూ ఉంటుంది, చూశావా వసుధార కాలం ఎలా మారిపోయిందో అనగానే, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా అనగానే, ఆ అవును మేడం ఒకేలా ఉండదు అని వసుధార అంటుంది. గుండెల్లో అంత ఆందోళన ఉన్నా, కూడా పైకి మాత్రం ధైర్యంగా మాట్లాడుతున్నావే అని దేవయాని అంటుంది. మీరు ఆ రోజు పెళ్లి రోజు వేడుకలు జరిపిస్తాను అన్న రోజే నాకు అనుమానం వచ్చింది, మీరు ఇలాంటిదేదో చేస్తారు అని కానీ, మీరు ఎన్ని అడ్డుగోడలు వేసినా కూడా ఎప్పటికైనా రిషి సార్ నిజం తెలుసుకుంటాడు అని వసుధార అనగానే, నీకింకా ఆశగా వుందా, నమ్మకం ఉందా అనగానే రిషి సార్ నిజం తెలుసుకున్న రోజూ మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు అర్థమౌతోందా మేడమ్ అని దేవయానితో అంటుంది.
అప్పుడు దేవయాని నా పరిస్థితి కాదు, ఇప్పుడు నీ పరిస్థితి ఎలా వుందో చూసుకో, నీ స్థానం ఏంటో నిరూపిస్తాను అని, వసుధార ఫోన్ నుంచి రిషికి ఫోన్ చేసింది, రిషి ఫోన్ కట్ చేస్తాడు, దేవయాని మళ్ళీ ఫోన్ చేయడంతో ఏకంగా ఫోన్ స్విచ్ఛాఫ్ పెడతాడు, చూశావా రిషి ఇప్పుడు భగ్గుమంటున్నాడు అని దేవయాని మాట్లాడుతుంది వసుధారతో, ఒకవైపు రిషి జరిగింది తలుచుకుంటుా, చాలా కోపంగా ఉంటాడు, ఏంటి వసుధార నువ్వు అబద్ధమా అని అన్ని విషయాలు, తనకు ప్రపోజ్ చేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు, అసలు ఏది నిజం, ఏది అబద్ధం అని తనలో తాను అనుకుంటూ ఉండగా, అక్కడికి మహేంద్ర వస్తాడు, మహేంద్ర ఎంతో ప్రయత్నించాడు రిషి తో మాట్లాడ్డానికి కానీ, రిషి మహేంద్ర చెప్పే మాటలను వినిపించుకోకుండా, ఎవరు స్వార్థాలు వారు చూసుకుంటున్నారు, కానీ మీ ప్రేమలో కూడా స్వార్థం ఉంటుందని నేను అనుకోలేదు అని ఇలా మాట్లాడటంతో, మహేంద్ర గుండె ముక్కలవుతుంది, బాధపడుకుంటూ, ఏడ్చుకుంటూ వెళ్లిపోతాడు.
Guppedantha Manasu 18 September 2022 Episode : మహేంద్ర వసుధార మీద కోపంగా ఉన్న రిషి
వసుధార చూసి ఏమైంది సార్ అనేసరికి కంట్లో నలక పడింది అమ్మా అని చెప్పి వెళ్లిపోతాడు, నలక మీ కంట్లో కాదు మనసులో పడింది అని నాకు తెలుసు అని వసుధార మనసులో అనుకుంటుంది, మహేంద్ర ఒక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు, జగతి వస్తుంది. జగతి తొ బాధగా నాకు జరిగింది చెప్పే అవకాశమే రిషి ఇవ్వటం లేదు అని ఏడుస్తూ ఉంటాడు.జగతి కూడా ఏడుస్తుంది, ఇలా ఇద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు, ఒకవైపు వసుధార రిషి దగ్గరికి వెళ్లి రిషితో మాట్లాడటానికి ఎంతో ప్రయత్నిస్తుంది, కానీ రిషి కోపంగా వసుధారతో మాట్లాడటానికి కూడా సిద్దంగా లేను అని చెబుతాడు.ఇలా దేవయాని చేసిన కుట్ర వలన అందరి మనసుల్లో బాధ ఉంటుంది.రిషి మనస్సును తిరిగి వసుధార మారుస్తుందా, లేదా ఏం జరగబోతోంది అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తోంది.