Winter Health care : మనం తీసుకునే ఆహారంలో పెరుగుకు చాలా ప్రాముఖ్యత ఉంది. అది వెజ్ అయిన నాన్ వెజ్ అయిన పంచభక్ష పరమాన్నాలైనా సరే చివర్లో పెరుగన్నంతో ముగించకుంటే ఆ భోజనం పూర్తికాదు. కొందరికైతే చివరలో పెరుగు అన్నం తినకపోతే అన్నం తిన్న ఫీలింగ్ కూడా కలగదు. అయితే ఈ పెరుగును చాలామంది ఇష్టంగా తింటే కొందరు మాత్రం అసలు ఇష్టపడరు. కానీ పెరుగును తినడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. పెరుగులో ఉండే కొన్ని ఔషధ గుణాలు మన శరీరంలో వచ్చే జబ్బులను కూడా నయం చేస్తాయట. అలాగే పెరుగులో ఉండే కాల్షియం ఫాస్పరస్ మరియు ప్రోటీన్లు శరీరానికి అవసరమైన బలాన్ని అందించి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
శాస్త్రీయపరంగా కూడా పెరుగు తీసుకోవడం వలన అనేక లాభాలు ఉన్నాయని రుజువైంది. అయితే పెరుగును ఎక్కువగా తీసుకోవడం వలన అధిక బరువు తగ్గే అవకాశం కూడా ఉందట. అలాగే పెరుగులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కావున పెరుగును ఎక్కువగా తీసుకోవడం వలన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. ఇక పెరుగును అనేక విధాలుగా కూడా తీసుకోవచ్చు. రైత ,లస్సి భోజన రూపంలో పెరుగును తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నప్పటికీ దాని ప్రయోజనాలు మాత్రం ఒకేలా ఉంటాయి. అయితే చాలామంది చలికాలం రాగానే పెరుగు తినడం మానేస్తారు. దానికి గల కారణం దగ్గు జలుబు వస్తాయని. అయితే దీనిలో ఎంతవరకు నిజముంది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అయితే వైద్య నిపుణులు అందిస్తున్న సమాచారం ప్రకారం పెరుగును ప్రతిరోజు తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిి పెరుగుతుంది. అలాగే జలుబు దగ్గు వంటి వ్యాధి నుండి కూడా పెరుగు చాలా బాగా రక్షిస్తుంది. అయితే చలికాలం కూడా పెరుగుతుంటే అలాంటి ప్రమాదం ఉండదని అర్థం. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది పెరుగును ఫ్రిజ్ లో పెట్టి ఉంచుతున్నారు. తద్వారా పెరుగు తినే సమయంలో చాలా చల్లగా ఉంటుంది. దీని కారణంగా మన శరీరంలో జలుబు తగ్గు వంటివి వస్తున్నాయి. కావున చలికాలంలో పెరుగును చల్లదనం పోయిన తర్వాత తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించాం. యువతరం దీనిని ధ్రువీకరించలేదు.