Video Editing App : మీరు కంటెంట్ క్రియేటర్ అవ్వాలనుకుంటున్నారా…?యూట్యూబ్లో వీడియోలను చేసి పోస్ట్ చేయాలనుకుంటున్నారా….?అయితే మీరు ఈ google యాప్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే దీని సహాయంతో మీరు చాలా సులువుగా వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చు.
అయితే నెలరోజుల క్రితం యూట్యూబ్ కొత్త వీడియో ఎడిటింగ్ కోసం యూట్యూబ్ క్రియేట్ అనే యాప్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ యాప్ తో ఎవరైనా సరే సులభంగా వీడియోలను క్రియేట్ చేయవచ్చు. అలాగే షేర్ కూడా చేసుకోవచ్చు.
అయితే ప్రస్తుతం ఈ యూట్యూబ్ క్రియేట్ యాప్ భారతదేశం తో పాటు అమెరికా ,ఇండోనేషియా, సౌత్ కొరియా, సింగపూర్ ,జర్మనీ ,ఫ్రాన్స్ మరియు యూకే వంటి దేశాలలో మాత్రమే అందుబాటులో ఉంది. మార్కెట్లో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వీటిని బీటా వర్షన్ తో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఐఓఎస్ వినియోగదారుల కోసం ఈ యాప్ ను వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్లు తెలియజేశారు.
అయితే ఈ యాప్ ను లాంచ్ చేసే సమయంలో ఈ యాప్ గురించి మాట్లాడుతూ ఇది ఉచిత యాప్ అని పేర్కొనడం జరిగింది. ఇక దీనిలో వీడియో ప్రొడక్షన్ చేయడం చాలా సులభం. అలాగే షార్ట్ మరియు లెన్త్ వీడియోలను కూడా చాలా సులువుగా , చాలా బెటర్ గా ఎడిటింగ్ చేసుకోవచ్చు.
ఇక ఈ యాప్ లో అనేక రకాల ఫ్యూచర్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనిలో కొత్త జనరేటివ్ ఏఐ పవర్డ్ యాప్ అలాగే ప్రెసిషన్ ,ఎడిటింగ్ ,ట్రిమ్మింగ్ , ఆటోమేటిక్ క్యాప్షనింగ్ , వాయిస్ ఓవర్ మరియు ట్రాన్సిషన్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.అంతేకాక టిక్ టాక్ బీట్ మాచింగ్ టెక్నాలజీ తో రాయల్టీ రహిత సంగీతాన్ని కూడా ఎంచుకోవచ్చు. యూట్యూబ్ అందించిన నివేదిక ప్రకారం ఈ కొత్త యాప్ రూపొందించడానికి కంపెనీ దాదాపు 3,000 మంది క్రియేటర్ల నుండి అభిప్రాయం తీసుకుందట. రాబోయే రోజుల్లో దీనికి మరిన్ని కొత్త ఫీచర్లు జోడించనుంది .