Health Tips : తేనె చర్మ సౌందర్యం పెంపొందించడంలో ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క పొడి, తేనెను కలిపి చర్మంపై రాస్తే దురద, చెమట పొక్కులు, తగ్గుతాయి. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణం దాల్చిన చెక్క లో ఉండి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవు.
దాల్చిన చెక్క లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ వ్యాధులకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ని తగ్గిస్తాయి. రక్తంలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్, ఆక్సిడేషన్ ఫ్యాట్స్ కు ఏజెంట్లుగా పనిచేస్తాయి. వీటన్నింటిని తొలగించడంలో దాల్చిన చెక్క, తేనె మిశ్రమం బాగా పనిచేస్తాయి. ఒక్క స్పూన్ దాల్చిన చెక్క పొడి రెండు స్పూన్ల తేనె కలిపి తీసుకోవడం వల్ల నరాల వాపు, కండరాల నొప్పులు, చర్మం పై ఉన్న మచ్చలు తగ్గుతాయి, దాల్చిన చెక్క, తేనెతో చేసిన పానీయాలను తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న మలినాలను ,వ్యర్ధాలను తొలగిస్తాయి.
Health Tips : దాల్చిన చెక్క, తేనె ఇవి రెండూ కలిపి తీసుకుంటే ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

ఈ చెక్కలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్, లక్షణాలు కలిగి ఉంటుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క పొడి కొద్దిగా తేనె కలిపి ముఖంపై ఉన్న కురుపులు, మచ్చలు, మొటిమలపై రాసి పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి ఇలా వారంలో ఒక్కసారి చేస్తే కురుపులు, మొటిమలు తగ్గుతాయి. దాల్చిన చెక్క ను రోజు కొంచెం నమిలితే దంతాలు సమస్యలు దూరం అవుతాయి. ఈ మిశ్రమాన్ని రోజూ తీసుకోవడం వల్ల జలుబు ,గొంతు నొప్పి వంటి సమస్యలు తొలగిపోతాయి.