Health Benefits : రాగి జావా ఎప్పుడు ఎలా తాగాలి.. దీంతో డయాబెటిస్ కంట్రోల్… అది ఎలాగంటే..?

Health Benefits : ప్రతి ఒక్కరి ఆరోగ్యం వారు తినే ఆహార పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది. పూర్వకాలంలో అన్నా నికి బదులు రాగి జావా లేదా రాగి ముద్దని అధికంగా వాడేవారు. రాగి రొట్టెలు, రాగి జావా బియ్యం వచ్చేసరికి ఒక మూలన పడిపోయాయి. ఎందుకంటే బియ్యం మెత్తగా మృదువుగా ఉండి త్వరగా జీర్ణమై కూరలతో పాటు తినడం వల్ల ఈజీగా జీర్ణం అవుతుంది. కానీ ప్రస్తుత కాలంలో అన్న న్ని ఎక్కువగా తీసుకోకూడదని. మళ్లీ మరల రాగులపై ఆసక్తి చూపుతున్నారు.

100 గ్రాముల రాగులు తీసుకుంటే. అందులో 320 క్యాలరీల శక్తి లభిస్తుంది. కార్బోహైడ్రేట్స్ 67 గ్రాములు ,ప్రోటీన్లు 12 గ్రాములు, కొవ్వు 7 గ్రాములు, ఫైబర్ 11 గ్రాములు ఉంటుంది. అంటే ఫైబర్ చాలా తక్కువగా ఉన్నట్లు అర్థం. వీటన్నింటిలోకెల్లా వీటిలో ముఖ్యమైనవి పోషకాలు, క్యాల్షియం, పొటాషియం ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు ఐరన్, క్యాల్షియం కూడా అధికంగా ఉంటాయి. ఇవన్నీ రాగుల్లో ఉన్న స్థూల ,సూక్ష్మ పోషకాలు. ఇటువంటి రాగులను రాగిజావలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Benefits : రాగి జావా ఎప్పుడు ఎలా తాగాలి

Diabetes Control with Ragi Java
Diabetes Control with Ragi Java

రాగిజావే కాకుండా రాగి రొట్టెలు కూడా చాలా మంచిది. ఈ డయాబెటిస్ ఉన్నవారికి, అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఇవి దివ్య ఔషధంగా పనిచేస్తాయి. రాగి పిండిలో పుల్లటి పెరుగు వేసి దోషాలు మాదిరిగా కూడా వేసుకోవచ్చు. కానీ రాగి ముద్ద జిమ్ ,ఎక్ససైజ్ ,కష్టపడి పనిచేసే వాళ్లు ,చిన్నపిల్లలకు ,గర్భిణీలకు ,బాలింతలకు చాలా మంచిది. ఇందులో ఉన్న ఫైటో కెమికల్స్ ,కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల నెమ్మదిగా రక్తంలో కలుస్తాయి.

అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్ చక్కెర రక్తంలో వెళ్లడానికి బాగా ఉపయోగపడతాయి. కావున షుగర్ వ్యాధి త్వరగా పెరగదు. బరువు ఎక్కువగా ఉన్నవారు ఎక్సర్సైజ్ తో పాటు క్రమం తప్పకుండా రాగి జావ తాగడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలస్ట్రాలు కరిగి ఈజీగా బరువు తగ్గుతారు. ఎముకలు, కండరాల సమస్యతో బాధపడేవారు క్యాల్షియం టాబ్లెట్లకు బదులుగా రాగి జావ లేదా రాగి ముద్ద తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీనితోపాటు మలబద్ధక సమస్యను కూడా దూరం చేస్తాయి. రక్తహీనత కూడా తగ్గుతుంది