Diabetes Symptoms : ప్రస్తుత కాలంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య అత్యధికంగా పెరిగిపోతుంది. జీవన శైలిలో మార్పులు, చెడు ఆహార అలవాట్లు వల్ల మానవుడు ఎన్నో రోగాలకు గురికావాల్సి వచ్చింది. భారతదేశం డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య తో ప్రథమ స్థానంలో ఉంది. మధుమేహం _1 మధుమేహం_2 ఇలా రెండు రకాలుగా ఉన్నాయి. మధుమేహం 2 రోగులు సంఖ్య భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. డయాబెటిస్ ని నియంతరించలేకపోతే, దీని ప్రభావం శరీరంలోనే అనేక అవయవాలపై కూడా కనిపిస్తుంది. డయాబెటిస్ పేషెంట్లలో షుగర్ పెరగడం వల్ల దీని ప్రభావం గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు వంటి అవయవాలపై ప్రభావం చూపుతాయి. మధుమేహ లక్షణాల గురించి తెలుసుకుందాం.
రోగి మరింత అలిసిపోయినట్లుగా, ఆహారం ఎక్కువగా తినడం, నీరు ఎక్కువగా తాగడం, అధికంగా మూత్ర విసర్జింపబడుతుంది. నోటి నుండి చెడు వాసన వస్తుంది. పురుషులు కంటే స్త్రీలలో మధుమేహం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. మహిళల్లో మధుమే మోహాన్ని సూచించే కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం.యూరినరీ ట్రాక్ట ఇన్ఫెక్షన్ అనేది మహిళ లో ఒక సాధారణ వ్యాధి. ఆరోగ్య నిపుణుల అంచనా ప్రకారం UT I అనేది వైరస్ ,బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వ్యాధి. ఈ వ్యాధి వల్ల స్త్రీలు కిడ్నీ, గర్భాశయం లేదా మూత్రశయం మొదలైన వాటిలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ కలిగి ఉంటారు. కొన్నిసార్లుUTl కూడా స్త్రీలలో మధుమేహానికి సాంకేతికంగా ఉంటుందని వివరించింది. కాబట్టి ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యం సలహాలు తీసుకోవాలి.
Diabetes Symptoms : మహిళల్లో ఇటువంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకండి…

ఎక్కువమంది మహిళలు తమ నోటిలో తెల్లటి పుండ్లు గురించి చెబుతూ ఉంటారు. ఇలా నోటిలో రోజు తెల్లటి పుండ్లు రావడం మధుమేహం లక్షణాలలో ఒకటి. ఇటువంటి లక్షణాలున్న మహిళలు వెంటనే మధుమేహం టెస్ట్ చేయించుకోవడం మంచిది. కొందరి మహిళల్లో మూడ్ స్వింగ్స్ తక్కువగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మహిళల్లో మూడ్ స్వింగ్స్ కూడా మధుమేహం సాంకేతికం కావచ్చు. మహిళల్లో అకస్మాత్తుగా బరువులు తగ్గడం మధుమేహ లక్షణాలను సూచిస్తుంది. కాబట్టి బరువుని ఎప్పుడు కప్పుడు చూస్తూ ఉండాలి. మీరు నిరంతరం ఎప్పుడు కప్పుడు బరువు తగ్గడం… మీరు కచ్చితంగా మధుమేహాన్ని టెస్ట్ చేసుకోవాలి. ఈ లక్షణాలన్నీ మధుమేహం ఉన్న మహిళల్లో తరచుగా కనిపిస్తాయి. కాబట్టి మహిళలు తమ మధుమేహాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి