Health Benefits : జామకాయలు అంటే అందరూ చాలా ఇష్టపడతారు. ఆకుపచ్చ రంగు జామకాయలు లో లోపల తెలుపు లేదా ఎరుపు రంగులో ఉంటాయి. కానీ నల్ల జామకాయలుని ఎప్పుడైనా చూసారా. నల్ల జామకాయలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జామకాయలు ఆకుపచ్చ రంగులో మాత్రమే కాకుండా నలుపు రంగులో కూడా ఉంటాయి. జామ పండ్లు తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి వివిధ రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారికి, దంత సమస్యలతో బాధపడే వారికి జామ ఆకులు వల్ల ఎంతో మేలు కలుగుతుంది. నలుపు వర్ణాన్ని కలిగిన జామ పండ్లు చర్మం పైన నలుపు రంగులో ఉండి లోపలి మాత్రం ఎర్రటి గుజ్జు వలె ఉంటాయి. ఆకుపచ్చ రంగులో ఉన్న జామ పండ్ల కంటే నలుపు రంగులో ఉన్న జామ పండ్లలో అధికంగా పోషకాలు ఉంటాయి.
విటమిన్స్, ఖనిజాలు, ఐరన్, క్యాల్షియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ నలుపు రంగు జాంపండులు తినడం వల్ల శరీరంలో రక్తం శాతం అధికమవుతుంది. అంతేకాకుండా రక్తం లేని సమస్యలు కూడా దూరం అవుతాయి. జామ పండ్లు తినడం వల్ల శరీరంలో ఉన్న రక్తాన్ని శుద్ధి చేయబడుతుంది. నేటి కాలంలో చాలామంది అందంపై ఆసక్తిచూపుతున్నారు. జామ పండ్ల లో యాంటీ ఎజినిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి.
వీటిని తినడం వల్ల చర్మంపై ఉన్న ముడతలు తొలగిపోయి అందంగా కనిపించడమే కాకుండా వృద్ధాప్య లక్షణాలు తలెత్తకుండా ఉంటాయని చూసి ఇస్తున్నారు నిపుణులు.
Health Benefits : నల్ల జామకాయలు తో ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా.

ఈ నలుపు రంగు జామకాయలు తినడం వల్ల కంటి సంబంధిత సమస్యలు దూరమైయి కంటి ఆరోగ్యాన్ని కి మేలు చేస్తుందని అంటున్నారు నిపుణులు. మలబద్ధక సమస్యతో బాధపడేవారు ఈ జామకాయలు తినడం వల్ల సమస్య నుండి విముక్తి పొందవచ్చు. అలాగే పురుషుల్లో ఎంతోకాలంగా వేధిస్తున్న ఫైల్స్ సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు నల్ల జామకాయలు అధికంగా ఉంటాయి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా రైనీ సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్లు, దగ్గు ,జలుబు, జ్వరం ,వంటి వ్యాధుల నుండి రక్షించుకోవడానికి ఈ నల్లజామ పండ్లు చాలా చక్కటి పరిష్కారాన్ని చూపుతాయి. రెండు సంవత్సరాల క్రితం బీహార్ విద్యాలయంలోని శాస్త్రవేత్తలు నాటిన ఈ నల్లని జామపండు వల్ల కలిగే ప్రయోజనాలు ఉన్నాయి అని చెబుతున్నారు నిపుణులు