Chandini Chowdary : సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా సాధారణం అయిపోయింది. ఒకప్పుడు క్యాస్టింగ్ కౌచ్ అంటే అమ్మో ఆ హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ ఎదుర్కుందా? పాపం అంటూ జాలి చూపేవాళ్లు. కానీ ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ అంటే ఏముందిలే అందరి హీరోయిన్స్ తో పాటు ఈ హీరోయిన్ అంటూ మాట్లాడుతున్నారు. అంతలా క్యాస్టింగ్ కౌచ్ అనే పదాన్ని కూడా దిగజార్చేస్తున్నారు సినీ ఇండస్ట్రీలో కొందరు. అయితే సినీ పరిశ్రమలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న హీరోయిన్లలో చాందిని చౌదరి కూడా ఒకరు.
చాందిని చౌదరి ‘ కలర్ ఫోటో ‘ సినిమా ద్వారా పాపులర్ అయింది. అంతకుముందు పలు విధాలుగా పాపులర్ అవ్వాలని చూసిన జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ కలర్ ఫోటో సినిమా ద్వారా అమ్మడు నటనకు అందానికి ప్రేక్షకులలో మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా ద్వారానే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్ని ఫ్లాప్ కావడంతో మళ్లీ ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడే ఆగిపోయింది.
Chandini Chowdary : ఆ స్టార్ డైరెక్టర్ చాందిని చౌదరితో చీప్ గా ప్రవర్తించాడట…

అయితే గతంలో కొన్ని చానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది చాందిని చౌదరి. ఆమె మాట్లాడుతూ తనకు కాస్టింగ్ కౌచ్ ఎదురైందని చెప్పుకొచ్చింది. ఓ ప్రముఖ డైరెక్టర్ తనను కమిట్మెంట్ అడిగారని చెప్పుకొచ్చి మీడియా ముందు ఎమోషనల్ అయింది. అంతేకాదు ఆ డైరెక్టర్ తనని తాకరానిచోట తాగుతూ కమిట్మెంట్ అడుగుతూ బిహేవ్ చేశారని దీనితో ఆమె నో చెప్పడంతో పెద్ద సినిమా నుంచి ఆమెను తీసేసారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు చాందిని చౌదరి ఇటీవల కోలీవుడ్ లో కూడా అడుగు పెట్టాలని చూస్తుందని సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి