Bay Leaves Benefits : బిర్యానీ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. బిర్యానీ తయారు చేయాలంటే అందులో తప్పనిసరిగా బిర్యానీ ఆకులు వేయవలసిందే. ఇవి నాన్ వెజ్ పరంగానే కాకుండా వెజ్ పరంగా చక్కని రుచిని అందిస్తుంది. ఇది రుచితో పాటు శరీరానికి కావాల్సిన వివిధ రకాల పోషకాలను కూడా అందిస్తుంది. ఈ ఆకు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉండి అనేక వ్యాధులను దూరం చేస్తుంది. మన శరీరానికి మేలు చేసే పొటాషియం, కాపర్, మెగ్నీషియం ,జింక్ ,క్యాల్షియం, ఐరన్ వంటి అత్యవసరమైన పోషకాలు బిర్యానీ ఆకులో లభిస్తాయి.
Bay Leaves Benefits : బిర్యానీ ఆకులతో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా.. ముఖ్యంగా ఈ వ్యాధిగ్రస్తులకి చక్కటి మెడిసిన్.
టెన్షన్స్ నుంచి ఉపశమనం పొందడానికి… రాత్రి పడుకునే ముందు మూడు ఆకులను తీసుకొని వాటిని కాల్చి గదిలో ఉంచడం వల్ల దాని నుంచి వెలువడే పొగ కారణంగా ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. శ్వాస సమస్యలతో బాధపడేవారు రోజు బిర్యానీ ఆకులు తినడం వల్ల ఈ సమస్య నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుంది. ఈ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిలో క్లాత్ ని ముంచి ఛాతిపై మర్దన చేసినట్లయితే శ్వాస సమస్యలు దూరం అవుతాయట. ఈ ఆకులతో ఆరోమాధెరపీ చేసుకోవడం వల్ల శరీరానికి ఎంతో విశ్రాంతి లభిస్తుందట.

టైప్ టు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు బిర్యానీ ఆకు దివ్య ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులో ఉండే ఔషధ గుణాలు వల్ల రక్తంలో చెడుకులస్ట్రాలు, గ్లూకోజ్, ట్రై గ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు కూడా చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది. రక్తంలోనే సుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. అలాగే వివిధ రకాల క్యాన్సర్లను దూరం చేసే గుణాలు ఈ ఆకులు ఎక్కువ పరిమాణంలో ఉన్నాయి. ఈ ఆకు సువాసనతో పాటు రుచిని కలిగించి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది