Viral Video : పాములంటేనే చాలామందికి హడల్. అది ఏపాము అయినా సరే.. అది విషపూరితమైనది అయినా.. విషపూరితమైనది కాకపోయినా సరే.. పామును చూస్తే చాలు చాలామంది జడుసుకుంటారు. వామ్మో పాము అంటూ పరిగెత్తుతారు. అది పాము అంటే అలా భయపడాల్సిందే మరి. చాలామంది పాములను చూస్తే చాలు జన్మలో ఆ ప్లేస్ కు వెళ్లరు. అయితే.. పాముల్లోనూ అన్ని పాములు డేంజరస్ కావు. కేవలం నాగుపాములు, ర్యాటిల్ స్నేక్స్, రక్తపింజర లాంటి పాములే డేంజర్. ఇవి కరిస్తే… క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే.

ఒక్క పామును చూస్తేనే అందరూ జడుసుకునే ఈరోజుల్లో ఒక యువతి ఏకంగా పదుల సంఖ్యలో ఉన్న నాగుపాముల మధ్యకు వెళ్లింది. నాగుపాములు పడగ విప్పితేనే చూసి ఆమడదూరం పరుగెడతాం. కానీ.. ఈ యువతి మాత్రం ఆ నాగుపాముల మధ్యలోకి వెళ్లింది. అత్యంత విషపూరితమైన కోబ్రాలకు ఆ యువతి స్నానం చేయించడం చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
Viral Video : నీ ధైర్యానికి హేట్సాఫ్ అంటున్న నెటిజన్లు
ఒక్క నాగుపామును చూస్తేనే దడుసుకుంటారు. కానీ.. నువ్వేంటమ్మా.. అన్ని నాగు పాముల మధ్య ఏమాత్రం భయం లేకుండా కూర్చున్నావు. అసలు నీకు భయమే లేదా.. నీకు ఇంత ధైర్యం ఎక్కడిది అంటూ నెటిజన్లు ఆ యువతిని చూసి నోరెళ్లబెడుతున్నారు. ఆ పాములన్నింటికీ ఆ యువతి స్నానం చేయిస్తోంది. అందులో నుంచి ఒక పాము అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా ఆ యువతి దాన్ని తీసి మళ్లీ అందులోనే విసిరేసింది. చిన్నపిల్లలతో ఆటాడినట్టుగా ఆటాడుతుంది ఈ యువతి ఆ పాములతో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
tutorial membersihkan kandang hewan pic.twitter.com/brixTODssI
— ???????????????????????? ???????????????????? ???????? ???????????????????????????????? (@FunnyVideosID) August 29, 2022