Lemon And Turmeric : పసుపు, నిమ్మరసం ఈ రెండిటి మిశ్రమం తాగితే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రెండిటిని కలిపి తీసుకుంటే మనకు ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయి. ఈ రెండింటి మిశ్రమాన్ని తీసుకుంటే శరీరంలోనే వివిధ సమస్యలు, అనేక వ్యాధులను దూరం చేయవచ్చు. ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు, నిమ్మరసం కలుపుకొని తాగితే బోలెడు లాభాలను పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడ్డ వారు నిమ్మరసం కలుపుకొని తీసుకోవడం ద్వారా ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. దీనిలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది.
ఈ రెండింటి మిశ్రమాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. అంతేకాకుండా బరువు కూడా ఈజీగా తగ్గుతారు. మానసిక ఆరోగ్యానికి ఈ రెండింటి కలయిక ఎంతో మేలు చేస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చలో నిమ్మకాయ రసాన్ని కలుపుకొని తాగడం వల్ల బాడీ హైడ్రేట్ డ్ గా ఉంటుంది. అదేవిధంగా జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగు పరుస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
Lemon And Turmeric : పసుపు, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని తాగితే.. కలిగే లాభాలు ఏంటో తెలుసా.?
శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావం తగ్గి కణజాలం రక్షింపబడుతుంది. గుండె సంబంధిత సమస్యలను దూరం చేసుకోవడానికి పసుపు నిమ్మరసా మిశ్రమాన్ని తీసుకుంటే సరిపోతుంది. వీటిలో ఉండే యంటీ యాక్సిడెంట్లు, యాంటీ డీప్రేసెంట్ గుణాలు ప్రతి ఒక్కరిలో ఒత్తిడిని తగ్గిస్తాయి. కీళ్ల నొప్పులతో పాటు వివిధ రకాల నొప్పులను తగ్గించుకోవడానికి ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే శ్వాసకోశ సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ మిశ్రమాన్ని ఫేస్ పై అప్లై చేసి ఫేస్ మాస్క్ గా, ఫేస్ ప్యాక్లా కూడా ఉపయోగించవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల చర్మం అందంగా మెరిసేలా తయారవుతుంది.