Inaya Sulthana : ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో 20 మంది కంటెస్టెంట్లు ఇంటిలోకి వచ్చారు. బిగ్బాస్ 6 లో ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరూ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో పేరు సంపాదించుకుని పైకొచ్చిన వారే. ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యి తనకంటూ ప్రజలలో గుర్తింపు తెచ్చుకున్న ఇనాయా సుల్తానా సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసింది. అయితే తనకు అనుకున్నంత గుర్తింపు సినిమాల ద్వారా రాలేదు. కానీ ఆర్జీలతో చేసిన ఒక్క వీడియో రాత్రికి రాత్రే పాపులర్ అయిపోయింది ఈ అమ్మడు. రాంగోపాల్ వర్మ బర్త్డే పార్టీలో చేసిన రచ్చ ఈ అమ్మడి జీవితాన్ని ఒక మలుపు తిప్పిందని చెప్పొచ్చు. ఆర్జీవి ఇనాయా సుల్తానా ను పట్టుకొని నలిపేసి ముద్దులు పెట్టుకుని హగ్గులతో చేసిన ఈ వీడియో నేట్టింట బాగా వైరల్ అయింది. ఈ విధంగా చేసిన ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇనాయా సుల్తానా ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది.
ఈ వీడియో సోషల్ మీడియాలోకి రాగానే నెటిజన్లు అందరూ ఒక్కసారిగా ఇనాయా సుల్తానా ఎవరు అని ఆరా తీసే పనిలో పడ్డారు. చిన్నచిన్న పాత్రల కోసం సినిమా ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న సినిమా ఆర్జీవితో చేసిన డాన్స్ వీడియో ఒక్కసారిగా తనకు పాపులారిటి తెచ్చి పెట్టింది. ఆ తర్వాత అనేక యూట్యూబ్ ఛానల్స్ ఇనాయా సుల్తానాను ఇంటర్వ్యూ చేశాయి. ఓ ఇంటర్వ్యూలో ఇనాయా సుల్తానా ఈ వీడియోకి సంబంధించి సంచలమైన కామెంట్స్ చేసింది. తమ ఇంట్లో ఎవరు ఇప్పటివరకు బయట ఉద్యోగానికి కూడా వెళ్లలేదని అంతేకాకుండా తన తల్లిదండ్రులు తాను ఇండస్ట్రీలోకి రావడానికి వారికి ఏమాత్రం ఇష్టం లేదని తన ఆవేదన ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేసింది.
Inaya Sulthana :అదేమైనా బూతా బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా సెన్సేషనల్ కామెంట్స్…!
తన తండ్రి కరోనాతో మరణించాడని తరువాత ఇంటిలోంచి వంద రూపాయలు తీసుకొని ఎవరికీ తెలియకుండా బయటికి వచ్చేసానని చెప్పింది. అయితే ఆ జీవి తన పుట్టినరోజుకి పిలిస్తే వచ్చారని ఆయనకు నచ్చిన పాటలు పెట్టుకొని తనతో కలిసి డాన్స్ చేశారని తెలియజేసింది. అందులో ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారి తన స్నేహితులు ఇంకా బంధువులు తనను అసహ్యించుకున్నారని ఇంటర్వ్యూలో తన ఆవేదనను తెలిపింది. ఈ వీడియో గురించి మాట్లాడుతూ తనేమన్నా బూతు వీడియోలు తీసానా అంటూ సినిమాలలో నే నటిస్తున్నా కదా ఆ మాత్రం చదువు డైరెక్టర్ తో ఉండదా అంటూ తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరో కోణంలో చూస్తే ఈ వీడియో ద్వారానే ఇనయా సుల్తానా పాపులర్ అయి బిగ్ బాస్ ఆఫర్ ను వచ్చేలా చేసింది. అయితే బిగ్బాస్ లో ఎంతవరకు రాణిస్తుంది అనేది వేచి చూడాల్సి ఉంది.