Tea Side Effects : చాలామంది టీ ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. టీ లలో గ్రీన్ టీ, లెమన్ టీ ,హెర్బల్ టీ ఇలా ఎన్నో రకాల టీలు ఉన్నాయి. కొందరు పనిలో ఒత్తిడి కారణంగా టీనే ఎక్కువసార్లు తీసుకుంటారు. కానీ, ఉదయాన్నే ఒక కప్పు టీ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు నిపుణులు. అయితే, కొంతమంది ఒక కప్పుతో సరిపెట్టారు.. రోజు మొత్తంలో ఎక్కువ సార్లు టీ తాగుతారు. ఎలా రోజు మొత్తం ఎక్కువసార్లు తాగడం వల్ల తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక రోజుల్లో టీ ఎన్నిసార్లు తాగాలని సందేహం చాలా మందికి రావచ్చు. ఒక రోజులో టీ ఎన్నిసార్లు తాగాలని విషయాన్ని తెలుసుకుందాం
రోజుకు మూడు, నాలుగు కప్పులన్ని టీ తీసుకోవడం వల్ల అది మీ ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. యూనివర్సిటీ ఆఫ్ మేరీ ల్యాండ్ మెడికల్ సెంటర్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. రోజుకు నాలుగు కప్పులు టీ తాగడం వల్ల శరీరానికి అనేక సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. టీ లో కేఫీన్ ఉండడం వల్ల గుండెలో మంట, తల తిరగటం, నిద్రలేని సమస్యలు, గ్యాస్, ఎసిడిటీ వంటి అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ కారణంగా టీ ని ఎక్కువసార్లు తీసుకోకూడదు.
Tea Side Effects : టీ ఎక్కువసార్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
ఎక్కువసార్లు టీ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి..?
టీలో ఉండే మూలికం వల్ల శరీరంలో ఐరన్ లోపాన్ని అధికం చేస్తుంది. శరీరంలో డిహైడ్రెరేషన్ సమస్య అవుతుంది. రోజు మొత్తంలో టీ ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల ఎముకలు బలహీన పడతాయి.
ఒక్కరోజులో ఎన్ని కప్పుల టీ తాగాలి.
రోజు మొత్తంలో ఒకటి లేదా రెండు కప్పుల టీ ని తీసుకోవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. జలుబు ,దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు బాధపడేవారు రోజుకు రెండు నుంచి మూడు కప్పుల హెర్బల్ తీసుకోవచ్చు. తేయాకు, పంచదారతో చేసిన టీవీ మాత్రం నివారించాలి