Naga Chaitanya-Samantha : సమంత, నాగచైతన్య విడిపోయి 10 నెలలు కావస్తుంది.వారీద్దరి విడాకులు గురించి వదిలేయండి అని సాక్షాత్తు నాగార్జున చెబుతున్న మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు మాత్రం ఇప్పట్లో వదిలేలా లేరు. ఇది ఇద్దరి బ్రేకప్ లపై రోజుకో కథ పుట్టుకొస్తుంది. చైతు, సామ్ విడిపోవడానికి కారణం ఏంటనేది తెలియకపోవడంతో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో ఒకటి రాసేస్తున్నారు. ఇక తాజాగా నాగార్జున మేనకోడలు సుప్రియ వల్లే సమంత నాగచైతన్య విడిపోయారని రాసి పారేశారు. దీనికి ఒక మంచి కథ కూడా అల్లేసారు.
సుప్రియ యంగ్ హీరో అడివి శేషు ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. అయితే ముందు నుంచి సుప్రియకు సమంతకు పడదట. అందుకే ఈ పెళ్లి జరగకూడదని సమంత అడ్డుపడిందంట. అదే చైతుతో దూరానికి కారణమైందని చివరకు వాళ్ల పెళ్లి పెటాకులయ్యేలా చేసిందని రాసుకు వచ్చారు. సుప్రియ ఇష్టం సినిమాలో హీరో చరణ్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే చరణ్ దూరలవాట్లకు లోనవ్వడంతో అతడికి దూరమైంది. తర్వాత చరణ్ మృతి చెందాడు. చాలా రోజులపాటు అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు చూసుకుంటూ సైలెంట్ గా ఉన్న సుప్రియ గూఢచారి సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది.
Naga Chaitanya-Samantha : సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం సుప్రియ నా…

ఆ సమయాల్లో అడవి శేషు తో ఏర్పడిన పరిచయంతో వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకుంటున్నారు అని ప్రచారం జరగడంతో అడివి శేషు కూడా స్పందించారు. కొన్నాళ్లు వదిలేయండి బాస్ అంటూ నెటిజన్లను వేడుకున్నాడు. అయితే ఈ వ్యాఖ్యలపై సుప్రియ స్పందించలేదు. అలాగని ఆమోదించను లేదు. సుప్రియ నాగచైతన్య చిన్నప్పటినుంచి సన్నిహితంగా ఉండేవారట. అది కూడా సమంతకు నచ్చేది కాదని, సుప్రియ తో ఆమెకి ఎక్కడో తెలియని గ్యాప్ వచ్చిందని అంటారు. అయితే చైతు సమంత విడాకులకు దారి తీస్తుందని రాసుకోవచ్చారు. నిజానికి అడవి శేషు సుప్రియ పెళ్ళికి సమంత ఎందుకు అడ్డుపడుతుంది అని కొందరు అంటున్నారు. అయితే చైతు సమంత పెళ్లిపై ఏ వార్తలు రాసిన వ్యూస్ వస్తున్నాయి కదా అని చాలామంది తమకి ఇష్టం వచ్చినట్లు రోజుకో కథ రాస్తున్నారు.