Anemia : మానవ శరీరంలో అన్ని భాగాలు సక్రమంగా ఉంటేనే అన్ని పనులు కరెక్ట్ గా జరుగుతాయి. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అన్ని రకాల క్రియలు జరగాలి. మానవ శరీరంలో ప్రధానమైనది రక్తం. బాడీలో సరిపడ రక్తం ఉంటేనే మనిషి ఆరోగ్యంగా జీవించగలడు. శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ అందాలన్నా.. అన్ని అవయవ భాగాలు సరిగా పనిచేయాలన్న రక్తం ఎంతో అవసరం. రక్తం సరిపడా లేకుంటే దానిని రక్తహీనతగా గుర్తిస్తారు. శరీరంలో రక్తం తక్కువగా ఉంటే హిమోగ్లోబిన్ ఉత్పత్తికి కావాల్సిన ఐరన్ లోపించడం వంటి సమస్యలు మొదలవుతాయి. నేటి కాలంలో చాలామందికి శరీరానికి సరిపడా రక్తం ఉందా.? లేదా? అన్నా అనుమానం వ్యక్తం చేస్తుంటారు.
అయితే శరీరంలో కనిపించే లక్షణాలు ఆధారంగా రక్తం సరిపడా ఉందో లేదో కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటో చూద్దాం. ప్రస్తుత కాలంలో చాలామంది తలనొప్పి అంటుంటారు. అటువంటి వారిలో రక్తహీనత సమస్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. శరీరంలో సరిపడా రక్తం లేని వారు మంచు ముక్కలు, బలపాలు, పెన్సిల్స్, గోడకు రాసిన సున్నం వంటి వాటిని తినాలని కోరిక పుడుతుంది. ఇటువంటి లక్షణాలు ఉన్నవారు రక్తహీనత ఉందనే నిర్ధారణకు రావచ్చు. రక్తహీనత ఉన్న వారిలో కనిపించే మరులక్షణం పెదవులు, చిక్కుళ్ళు, కను బొమ్మల లోపల ఎరుపు తగ్గడం.
Anemia : అయితే ఈ లక్షణాల ఉన్నాయో చెక్ చేసుకోండి.

ఎలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే రక్త పరీక్ష చేయించుకోవాలి. శరీరం అంతా నొప్పులు, కండరాల నొప్పులు, రోజు ఏదో ఒక నొప్పితో ఆందోళన చెందే వారు రక్తహీనతగా గుర్తించాలి. శరీరంలో సరిపడా రక్తం లేకపోతే ఏ పనులు సక్రమంగా చేయలేరు. ప్రతి చిన్న పనికి ఎంతో అలసటగా అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. రక్తహీనత ఉన్న వారి చర్మం తెల్లగా పాలిపోయి కనిపిస్తుంది. ఇటువంటి వారు కూడా వెంటనే వైద్యులు కలవడం మంచిది. కొందరిలో శరీరం రోజు చల్లగా ఉంటుంది. లాంటి వారిలో రక్తహీనత సమస్య ఉందని గుర్తించాలి.