Neha Sharma : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో కలిసి నటించిన హీరోయిన్ నేహా శర్మ గురించి ఒక వార్త నెట్ ఇంట్లో లో వైరల్ అవుతుంది. రామ్ చరణ్ తేజ్ సినిమాలో ఓసోసి రాకాసి అనే పాటలో హీరోతో ఆడి పాడి చిందులేసింది. ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసింది. అయినా తనదైన స్టైల్ లో నటించి అభిమానులకు గుర్తుండిపోయింది. అసలు తెలుగులో చేసింది రెండే రెండు సినిమాలు.
Neha Sharma : రామ్ చరణ్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్న స్టార్ ప్రొడ్యూసర్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సినిమా ‘ చిరుత ‘తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాను డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కా మాస్ లుక్కుతో కనిపించాడు. హీరోయిన్గా నేహ నటనాపరంగా మంచి మార్కులే కొట్టేసింది. ఈ సినిమా హిట్ తర్వాత హీరో వరుణ్ సందేశ్ తో ‘ కుర్రాడు ‘ సినిమాలో నటించింది. ఈ సినిమా నేహా శర్మ కి మంచి గుర్తింపు ఇవ్వలేకపోయింది. దీంతో అమ్మడికి సినిమా అవకాశాలు రాలేదు. అయితే రీసెంట్ గా నేహా శర్మ పెళ్లి పీటలెక్కబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు బాలీవుడ్ ప్రొడ్యూసర్ ని అంటూ వార్తలు వస్తున్నాయి.

గత కొద్ది కాలంగా నేహా శర్మ యంగ్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ తో డేటింగ్ లో ఉందని మరికొద్ది రోజుల్లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది. కాగా రామ్ చరణ్ నటించిన చిరుత సినిమాలో నేహ శర్మ తనదైన స్టైల్ లో నటించి చిరంజీవి చేత కూడా శభాష్ అనిపించుకుంది. అంతేకాదు మొదటి సినిమా అయినా సరే ఏమాత్రం భయపడకుండా డైరెక్టర్ చెప్పినట్లుగా సినిమాలో చేసింది. అయినా డైరెక్టర్స్ కి కోపరేట్ చేస్తున్నా కానీ తనకి సినిమా అవకాశాలు ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు. ఏదైతేనేం త్వరలో పెళ్లి చేసుకొని ఓ ఇంటిది కాబోతుంది నేహా శర్మ అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.