ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు, బెల్లీ ఫ్యాట్.. వయసు తరహా లేకుండా ఈ సమస్యతో అందరూ సతమతమవుతున్నారు. ఈ సమస్య రావడానికి కారణం ఆహారంలో మార్పులు, సరైన శ్రమ లేకపోవడం, ఈ సమస్యల నుంచి బయటపడడం కోసం ప్రతి రోజు ఉదయం ఈ డ్రింక్ ని తాగండి. మీ అధిక బరువుకి బై బై చెప్పండి.. ఇప్పుడు ఆ డ్రింక్ ఏంటో మనం తెలుసుకుందాం.. వైద్య నిపుణుల ప్రకారం: అధిక బరువు తగ్గడానికి ప్రజలు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రయత్నం అనేది అందరికీ సక్సెస్ అవ్వదు.. ఇందులో ముఖ్యంగా హెల్తీ ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయడం లాంటివి చేస్తూ ఉండాలి. వాటితో పాటు ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..
అధిక బరువుని తగ్గించే డ్రింక్: నిపుణుల ప్రకారం బరువు తగ్గడానికి ఆయుర్వేదంలో ఎన్నో మూలికలు ఉన్నాయి. ధనియాలు లాంటి మూలికలు ఇవన్నీ కూడా పొట్టలోని కొవ్వును సులభంగా కలిగిస్తాయి. వీటిని తయారైన మిశ్రమం ప్రేగు పనితీరును ఉత్తేజపరిచి బరువుని సులభంగా తగ్గిస్తుంది. బరువుని ఎలా తగ్గిస్తుంది; దీనిలో వాడే మూలికలన్నీ ఆయుర్వేదంలో ఔషధాలుగా వినియోగిస్తూ ఉంటారు. ఈ మూలికల కలయిక అధిక బరువును తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థను హెల్తీగా ఉంచడంలో గ్యాస్టిక్ సమస్యల్ని దూరం చేస్తాయి. బాడీలోని జీవక్రియను సరిగ్గా ఉంచడంలో ఈ మసాలాలు అన్నీ ఉపయోగపడతాయి.
సోంపు, ధనియాలు, జీలకర్ర, ఇంగువలోని యాంటీ ఇంప్లమెంటరీ లక్షణాలు కడుపునింపడంలో ఉపయోగపడతాయి. ఇది ఆకలిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ క్యాలరీలు తీసుకోకుండా ఆపుతుంది. ఈ పౌడర్ ని ఎలా తయారు చేయాలి: ఇంగువ చిటికెడు, సోంపు రెండు స్పూన్లు, ధనియాలు రెండు స్పూన్లు, జీలకర్ర రెండు స్పూన్లు.. దీని తయారీ విధానం: అన్నిటినీ తీసుకొని బాగా ఫ్రై చేయాలి. చివరగా దానిలో ఇంగువ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.. ఏ సమయంలో తీసుకోవాలి; ఉదయాన్నే గ్లాసు గోరువెచ్చని నీటిలో చెంచా పొడిని దీనిలో కలిపి తీసుకోవాలి. దీని తాగడం వలన బరువు సులభంగా తగ్గుతారు.