ప్రియురాలు చేసిన పనికి తట్టుకోలేక ప్రియుడు కోపంతో స్క్రూ డ్రైవర్ తీసుకొని ఏం చేశాడంటే ..??

girl friend murder
girl friend murder

ఈ సంఘటన ఛత్తీస్ ఘఢ్ లోని కోర్బా జిల్లాలో జరిగింది. కోర్బా జిల్లా పోలీస్ స్టేషన్ సమీపంలోని పంప్ కాలనీకి చెందిన నీలం కుసుం పన్నా బస్ కండక్టర్ షాబాజ్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే కొన్నాళ్ళకు అతడు కొత్త జాబ్ వెతుక్కుంటూ గుజరాత్ కి వెళ్ళాడు. ఆ తర్వాత నీలం, శాబాజ్ మధ్య బంధం బలహీన పడింది. షాబాద్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని తెలుసుకున్నాడు. అయితే కొన్ని రోజులకు షాబాజ్ కోర్బానీలో పని ఉందని వచ్చాడు.

Advertisement

ఆరోజు నీలం కుసుం ఇంటికి వెళ్ళాడు. నీలం తో కొంచెం సేపు మాట్లాడాడు. అప్పుడే స్క్రూ డ్రైవర్తో కుసుంపై దాడి చేశాడు. ఛాతిలో 34 సార్లు, వెనుకవైపు 16 సార్లు స్క్రూ డ్రైవర్ తో పొడిచి చంపాడు. దీంతో కుసుం అక్కడికక్కడే మృతి చెందింది. చుట్టు ప్రక్కల వారు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే అక్కడికి చేరుకొని షాబాజ్ ను అరెస్ట్ చేసారు. ప్రేమించిన అమ్మాయిని చంపడానికి చేతులు ఎలా వచ్చాయిరా అంటూ జనాలు పిచ్చి తిట్లు తిట్టారు. కొందరు అతడిని కొట్టబోయారు కూడా. ఈ సమయంలోనే పోలీస్ లు అక్కడకి చేరుకున్నారు.

Advertisement

ఈ నేరం తను చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇలా ఒక్కొక్కటిగా అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో సాహిల్ అనే వ్యక్తి మైనర్ బాలికను 40 సార్లు పొడిచి చంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేరం తను చేసినట్లు సాహిల్ ఒప్పుకున్నాడు. మేజర్లే కాదు మైనర్ బాలికలు కూడా ప్రేమ అంటూ యువకుల చేతిలో మరణిస్తున్నారు. ఏంటో ప్రస్తుతం నేరాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఎన్ని శిక్షలు అమలు చేసిన జనాలలో కొద్దిగా కూడా భయం అనేది లేకుండా పోతుంది.

Advertisement