Antibiotics : మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా ఆల్కహాల్ తీసుకోవడం మానరు. దీనికి బానిసగా మారిన వారు చాలామంది ఉన్నారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు కొన్ని రకాల మందులు వాడవలసి ఉంటుంది. అదే సమయంలో మద్యపానియానికి దూరంగా ఉండవలసి ఉంటుంది. ముఖ్యంగా యాంటీబయోటిక్స్ మందులు వాడుతున్నప్పుడు మద్యపానం దూరంగా ఉండవలసిందే. లేదంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురికావాల్సి ఉంటుంది. యాంటీబయోటిక్స్ తీసుకున్నప్పుడు జాగ్రత్తలు పాటించాల్సిందే. ఆల్కహాల్ వల్ల బలమైన ప్రతి చర్యను చూపించే కొన్ని యాంటీబయోటిక్ లో ఉన్నాయి.
ఈ మందులు వాడుతున్నప్పుడు ఆల్కహాల్ ని తాగకూడదు. ఇది పొట్ట, కాలేయం ,మెదడు ,యోనిలో బ్యాక్టీరియాలను చంపేందుకు ఇచ్చే యాంటీబయోటిక్ దీనిని వాడుతున్నప్పుడు ఆల్కహాల్ ని తాగకూడదు. పేగులో ఇన్ఫెక్షన్లకు, యోనిలో ఇన్ఫెక్షన్లకు మరియు వివిధ రకాల ఇన్ఫెక్షన్ల కు చికిత్స చేసేందుకు ఎక్కువగా ఈ ఆంటీ బయోటిక్ ని చూసిస్తారు. చర్మానికి వచ్చే వివిధ రకాల అంటూ వ్యాధులు, ని యోనియా వంటీ సమస్యలకు దీన్ని చూసిస్తారు. ఈ మందులు తీసుకున్నప్పుడు మద్యపానం తాగడం వల్ల రక్తపోటు అధికమయ్యే అవకాశం ఉంటుంది. యాంటీబయోటిక్స్ మందులు తీసుకున్నప్పుడు మద్యం తీసుకోవడం వల్ల పొత్తి కడుపులో తిమ్మిరి, వికారం ,తలనొప్పి ,వాంతులు ,గుండె దడ పెరగడం వంటి సమస్యలు పెరుగుతాయి.
Antibiotics : యాంటీబయోటిక్ మందులతో పాటు ఆల్కహాల్ తాగుతున్నారా..?

యాంటీబయోటిక్స్ తీసుకున్నాక ఆల్కహాల్ తాగితే కొన్ని గంటల్లోనే చెడు ప్రభావాలు కనిపిస్తాయి. ఈ ప్రభావాలు అధికమైనట్లయితే వైద్య సలహా తీసుకోవాలి. ఆల్కహాల్ తాగటం వల్ల మీ శరీరంలోనే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. యాంటీబయోటిక్స్ మందులతో పాటు ఆల్కహాల్ కలిస్తే వాంతులు, విరోచనాలు ,వికారం వచ్చే ప్రమాదం ఉంది. మద్యం మీ శరీరాన్ని డిహైడ్రేషన్ కు గురిచేస్తుంది. ఈ పరిస్థితి అధికమైతే అనారోగ్య సమస్యలకు గురికావాల్సి ఉంటుంది. కాబట్టి యాంటీబయోటిక్స్ మందులతో పాటు ఆల్కహాల్ తీసుకోవడం మంచిది కాదు అని వైద్య నిపుణులు హెచ్చరించారు.