Mohan Babu : ఇక భక్తులు షిరిడీకి వెళ్లాల్సిన అవసరం లేదు.. మోహన్ బాబు షాకింగ్ వ్యాఖ్యలపై భక్తుల ఆగ్రహం

Mohan Babu : మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా కెరీర్ కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తోంది. దాదాపు 40 ఏళ్ల నుంచి ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. అందుకే ఆయనకు విలక్షణ నటుడు అనే పేరు వచ్చింది. ఆయనకు శ్రీవిద్యానికేతన్ అనే విద్యాసంస్థలు కూడా ఉన్నాయి.

manchu mohan babu comments viral on shirdi temple

manchu mohan babu comments viral on shirdi temple

అయితే.. మోహన్ బాబు.. సాయిబాబాకి పరమ భక్తుడు. చాలా సందర్భాల్లో ఆ విషయాన్ని మోహన్ బాబు చెప్పారు. అందుకే.. ఆ భక్తిని నిరూపించుకోవడం కోసం మోహన్ బాబు చంద్రగిరి మండలం రంగంపేటలో అతి పెద్ద సాయిబాబా గుడిని నిర్మించాడు. ఆ గుడికి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా తాజాగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ పాల్గొన్నది. ఈసందర్భంగా మంచు ఫ్యామిలీ పూజా కార్యక్రమాలను ఆ గుడిలో నిర్వహించారు.

Mohan Babu : దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద సాయిబాబా ఆలయం అది

ఈసందర్భంగా మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ దక్షిణాదిలోనే ఈ ఆలయం అతిపెద్దదని వెల్లడించారు. అలాగే.. ఇదొక అద్భుతం అని మాట్లాడిన మోహన్ బాబు.. తన దృష్టిలో భక్తులు ఇక షిరిడీ సాయినాథుడి ఆలయానికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. దీంతో కొందరు సాయిబాబా భక్తులు మోహన్ బాబు వ్యాఖ్యలను తప్పుపట్టారు.

అలాగే.. మంచు విష్ణు ఈ గుడిని కడితే అద్భుతంగా కట్టమని లేకపోతే కట్టకు అని చెప్పాడని అందుకే వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చే భక్తులంతా ఈ గుడికి రావాలని.. మహాద్భుతంగా దీన్ని నిర్మించాం అన్నాడు. రుషికేష్ నుంచి దాదాపు 110 సంవత్సరాల వయసుకు పైనే ఉన్న యోగులు, రుషీశ్వరుల నుంచి చెక్కలు, లిపితో రాసిన అమూల్యమైన మూలికలను పీఠం వద్ద పెట్టామన్నారు. ఈ గుడిని తన కోసం నిర్మించలేదని, యావత్ దేశం కోసం, అందరు ప్రజల కోసం, తెలుగు రాష్ట్రాల కోసం నిర్మించామన్నారు.

అయితే.. మోహన్ బాబు వ్యాఖ్యలను కొందరు భక్తులు, నెటిజన్లు తప్పుపడుతున్నారు. సాయిబాబాకు ఆలయం నిర్మించడం గొప్ప విషయం కానీ.. ఇలా షిరిడీకి భక్తులు వెళ్లాల్సిన అవసరం లేదు అని అనడం కరెక్ట్ కాదు అని భక్తులు హితువు పలుకుతున్నారు.