Health Tips : అందంగా ఫిట్ గా కనిపించాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. కానీ వయసు పెరిగే కొద్దీ శరీరం పట్టు కోల్పోతూ…మెల్లిగా అందాన్ని కూడా తగ్గిస్తుంది. 40 ఏళ్ల వయసు వచ్చేసరికి చర్మం నిగారింపు కూడా కోల్పోతుంది.మొఖంపై ముడతలు రావడం ,చర్మం పొడిబారడం వంటి సమస్యలు కూడా మొదలవుతాయి. అయితే కొన్ని చిట్కాలను పాటించడం వలన చర్మంపై నివారింపు, అందాన్ని ఎప్పటికీ అలాగే నిలబెట్టుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లు కారణంగా శరీరంలో కూడా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడంతో శరీరం పై ప్రభావం చూపిస్తుంది. అందుకే పోషకాలు ఉండేలా ఆహారం తీసుకోవడం తప్పనిసరి. మరి ముఖ్యంగా నాణ్యతలేని ఆహార పదార్థాలను తినడం వలన చర్మ సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయి. దీని కారణంగా చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కూడా కనిపిస్తుంటాయి . ఇలాంటి వాటిని అరికట్టడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటంటే….
- యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభించే పండ్లు మరియు కూరగాయలు, చేపలు వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వలన చర్మంపై వృద్ధాప్య చాయలు కనిపించవు…
- టోనింగ్, మాశ్చరైజర్ వంటి వాటిని వినియోగించడం ద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.
- సూర్యకాంతిలో ఎక్కువసేపు తిరుగుతున్నట్లయితే సన్ స్క్రీన్ అప్లై చేయడం ద్వారా చర్మాన్ని కాపాడుకోవాలి.
- అలాగే ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఉండాలి. యోగ ,ఈత ,ఏరోబిక్ శ్వాస , వ్యాయామాలు , బరువులు ఎత్తడం వంటివి శరీరాన్ని దృఢంగా మరియు యవ్వనంగా ఉంచేలా చేస్తుంది.
- ఇవన్నీ పాటించినప్పటికి చర్మం యవ్వనంగా ఆరోగ్యంగా లేనట్లయితే కొల్లజన్ లోకం ఏర్పడిందని అర్థం. ఈ సమయంలో వెంటనే డాక్టర్ను సంప్రదించి సమతుల్యమైన ఆహారాన్ని ఎంచుకొని తీసుకోవడం మంచిది.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించాం. ఇది మీ అవగాహన కోసం మాత్రమే. యువతరం దీనిని ధ్రువీకరించలేదు.