Salman Khan : తాజాగా 54వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొనేందుకు సల్మాన్ ఖాన్ గోవా చేరుకున్నారు. ఇక సల్మాన్ వ్యక్తిత్వం గురించి అందరికీ తెలిసిందే కదా…ఎక్కడికి వెళ్ళినా అందరి దృష్టి అతనిపై ఉండేలా చేస్తాడు. ఈ క్రమంలోనే ఫిలిం ఫెస్టివల్ లో సల్మాన్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో సల్మాన్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. అలాగే సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. ఇక అక్కడే భారీగా జనాలు గుమ్మిపూడి సెలబ్రిటీలను చూస్తున్నారు. అయితే ఈ సమయంలో సల్మాన్ దగ్గరకు ఓ మహిళ వచ్చింది. ఇక వెంటనే సల్మాన్ ఖాన్ ఆమెను పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు.
ఇక ఇది చూసి అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆ మహిళ కూడా అవాక్కయింది. అనంతరం అందరూ తీరుకొని సల్మాన్ తో సరదాగా సంభాషణ కొనసాగించారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో సల్మాన్ ఖాన్ ఆలీవ్ గ్రీన్ కలర్ షర్ట్ లేత గోధుమరంగు ఫ్యాంట్ ధరించి అందర్నీ ఆకర్షించారు. అయితే ఆ వీడియోలో కనిపిస్తున్న వృద్ధురాలు జర్నలిస్ట్ అట. ఆమె సల్మాన్ ఖాన్ కి పాత స్నేహితురాలు. అయితే ఆమెను చూసి గుర్తుపట్టిన సల్మాన్ ఖాన్ వెంటనే ఆమె వద్దకు వచ్చాడు.
LATEST : #Salmankhan at #IFFI2023
Crowd following him and guards covering him
Also hugged old lady who came to meetPeople's Man @BeingSalmanKhan | #Tiger3 pic.twitter.com/fMOKA6UAV7
— FIGHTя (@SalmanzFighter_) November 21, 2023
ఆమె నుదుటిపై ముద్దు పెట్టి గట్టిగా కౌగిలించుకున్నాడు. అయితే అదే సమయంలో చుట్టూ ఉన్న వారంతా సల్మాన్ ఖాన్ చేసిన పని చూసి నవ్వుకున్నారు. కానీ ఎలాంటి విభేదం చూపకుండా సల్మాన్ చేసిన పనికి అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఇకపోతే తాజాగా సల్మాన్ నటించిన టైగర్ 3 సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ బ్లాక్ బాస్టర్ అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా 376 కోట్లు వసూలు చేయగా ఇంకా బరిలో కొనసాగుతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కత్రినా కైఫ్ ఇమ్రాన్ హస్మి నటించడం జరిగింది