Astrological Predictions : మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ రానుంది. ఈ క్రమంలోనే మూడు రాశుల వారికి మహా అదృష్టం పట్టనునట్లు శాస్త్రం చెబుతోంది. కొన్ని రాశుల వారికి గ్రహాలు సంచారం మారడం వలన నవంబర్ నెలలో దీపావళి పండుగ సందర్భంగా కొన్ని గ్రహాల ప్రత్యేక ప్రభావం కొన్ని రాశుల వారిపై పడుతుంది. ఇక వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మిధున రాశి…
నవంబర్ నెలలో జరగబోయే కొన్ని గ్రహాల సంచారం వలన మిధున రాశి వారికి అత్యంత శుభ ఘడియలు రానున్నాయి. ఈ నేపథ్యంలోనే వారు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపార రంగంలో ముందుకు సాగుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
ధనస్సు రాశి…
గ్రహాల సంచార వలన ఈ రాశుల వారికి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. రాజకీయరంగంలో ఉన్నవారు కొత్త పదవులను పొందగలుగుతారు. అన్ని రంగాల వారికి సమయం సహకరిస్తుంది. అనుకున్నవన్నీ పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈ రాశుల వారికి కాలం కూడా అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తుంది. అవసరం లేని వ్యక్తుల సాంగత్యం కాస్త ఇబ్బందిగా మారుతుంది. మేలు చేస్తారని భావించిన వ్యక్తులు మొఖం చాటేసే అవకాశాలుంటాయి.
తులారాశి…
ఈ నెలలో ఈ రాశి వారు కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఉద్యోగ రిత్యా ప్రశంసలు అందుకుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా మంచి ఫలితాలను పొందుతారు. కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో కాస్త ఒడిదుడుకులు ఉంటాయి. అయితే ఈ మూడు రాశుల వారు కొన్ని పరిహారాలు పాటించాలి..విష్ణు సహస్రనామ సూత్రాన్ని పటిస్తూ ఉండాలి..ఇలా చేయడం వలన ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. అలాగే 10 ముఖాలు కలిగిన పంచముఖ రుద్రాక్ష భరించాలి. అలాగే ప్రతి బుధవారం పచ్చటి వస్త్రాలు కట్టుకుని విష్ణు పూజ చేయడం ఉత్తమం.
గమనిక : పైన పేర్కొనబడిన కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే…యువతరం దీనిని ధృవీకరించలేదు..