Emmanuel : సామాన్యులతో పోలిస్తే సినీ మరియు టీవీ ఆర్టిస్టుల పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది.ఎందుకంటే వారు బయట తిరుగుదామంటే సెల్ఫీలు ఫోటోలంటూ ఫ్యాన్స్ వెంటపడతారు. ఇక కాస్త గ్యాప్ ఇచ్చి కొన్ని రోజులు కనిపించకపోతే అంతే సంగతి. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా వారి గురించి రాసేస్తారు. ఈ క్రమంలోనే చాలామంది ఆర్టిస్టులను సోషల్ మీడియా బ్రతికుండగానే చంపేసింది. అయితే తాజాగా జబర్దస్త్ కమెడీయన్ ఇమ్మానుయేల్ కూడా ఇలాంటి ఓ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా యూట్యూబ్ లో ఇమాన్యుల్ ఇక లేరు అనే వార్తలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. ఇక ఈ వార్తలు చూసి షాక్ అయిన ఇమ్మానుయేల్ తాజాగా వీటిపై స్పందించారు.
ఇలా వస్తున్న వార్తలు పై ఇమ్మానుయేల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఇమ్మానుయేల్ మాట్లాడుతూ….అరే చేతకాని కొడుకులు…నేను నటనం చేస్తే చచ్చిపోయా అంటున్నారు..నటనం రా అది నా నటనం. ఇలాంటి వాళ్ళని ఏమంటారు తెలుసా…చేతకాని కొడుకులు…నా వీడియో ఎక్కడ దాక వచ్చిందో కామెంట్స్ లో తెలియజేయండి అంటూ ఇమాన్యుల్ సరదాగా స్పందించాడు. అలాగే నేను చావలేదు రా అది ” ప్రేమ వాలంటీర్” లో చేసిన సన్నివేశం అంటూ చెప్పుకొచ్చారు.
అయితే నిజానికి ఇమ్మానుయేల్ ఇటీవల ప్రేమ వాలంటీర్ అనే వెబ్ సిరీస్ లో చేయడం జరిగింది. ఇక దీనిలో భాగంగా తన నటన కామెడీకి మంచి మార్కులు కూడా పడ్డాయి. అయితే ఈ వెబ్ సిరీస్ లోని లాస్ట్ ఎపిసోడ్ లో ఇమ్మానుయేల్ చనిపోతాడు. ఇక దీనిలోని ఆ సీన్ ను కట్ చేసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇమాన్యుయల్ చనిపోయాడంటూ వ్యూస్ కోసం రాస్కొచ్చారు. దీంతో ఈ న్యూస్ విన్న ఆడియోన్స్ కూడా చాలామంది ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఈ వీడియోలు చూసిన ఇమ్మానుయేల్ ఈ విధంగా సోషల్ మీడియాలో స్పందించడం జరిగింది.
View this post on Instagram