Hibiscus Tea : మన చిన్నప్పుడు పాఠశాల పుస్తకాలలో కూడా మందార పూల గురించి వినే ఉంటాం. ఇవి కేవలం అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అందుకే దీనిని హైబిస్కస్ అని కూడా పిలుస్తుంటారు. అయితే దీనిని ఆహార పదార్థాలతో కలిపి కూడా తీసుకోవచ్చు. అలాగే మందుల తయారీలో కూడా దీనిని విరివిగా ఉపయోగిస్తారు. మరియు ముఖ్యంగా యునాని మందుల లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాగే ఇది కొలెస్ట్రాల్, మధుమేహం ,గొంతు సమస్యలు, రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు, జలుబు వంటి వాటికి ఔషధంలా పనిచేస్తుందట. అలాగే దీనిలో విటమిన్ సి, క్యాల్షియం,పీచు పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి. అందుకే వీటిని తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు తెలియజేస్తున్నారు.
అయితే దీనిని టీ లాగా కూడా తీసుకోవచ్చట. మరి దానిని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా కొన్ని మందార పువ్వులను తీసుకొని ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత నీటిని మరిగించి దానిలో ఈ ఎండిన మందార పువ్వులను వేసుకోవాలి. ఇక దీనిలో కాస్త చక్కెర కాస్త టీ పొడి వేసుకొని మరిగించుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న దానిని హైబిస్కస్ హెర్బల్ టీ అని అంటారు. ఇక దీనిని ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే దీనిని వేడి చల్లార్చుకుని దానిలో కాస్త ఐసు ముక్కలు జోడించి తాగినట్లయితే అదే కాఫీలా కూడా ఉంటుంది. దీనిని ఎన్ని రకాలుగా తీసుకున్నప్పటికీ ప్రయోజనాలు మాత్రం ఒకే రకంగా ఉంటాయి.
ఇక దీనిని ఎందుకు తీసుకోవాలలో చెప్పడానికి ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వలన బ్లడ్ ప్రెజర్ నార్మల్ స్థాయికి చేరుకుంటుంది. అలాగే ఇది మూత్ర విసర్జన మరియు పేగు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఉత్తమ ఉత్పత్తి అని చెప్పవచ్చు. కావున మీరు ఇప్పటివరకు దీనిని ప్రయత్నించకపోతే ఒకసారి ప్రయత్నించి చూడండి. ఆరోగ్యపరంగా మరియు రుచి పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి తాగడానికి చింతించాల్సిన అవసరం లేదు. ఇక తీయదనం కోసం కాస్త చెక్కర లేదా తేనెను జోడించుకోవచ్చు. అంతేకాక దీనిలో దాల్చిన చెక్క, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలను కూడా కలుపుకుని తాగవచ్చు.
గమనిక : పైన పేర్కొనబడిన అంశం ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. యువతరం దీనిని ధ్రువీకరించలేదు.