Hot Limon Water : మన శరీరానికి నిమ్మరసం డీ హైడ్రెటేగా ఉండి పొట్ట సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. చాలామంది ఈ మిశ్రమాన్ని తాగడానికి ఇష్టపడతారు. అయితే మీరు ఎప్పుడైనా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగారా? నిమ్మరసం తాగడం వల్ల అలసట తగ్గి శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. సాధారణంగా చాలామంది నిమ్మరసం తయారు చేసేటప్పుడు చల్లటి నీటిని నీటిని కలుపుతారు. చల్లని నీటితో తయారుచేసిన నిమ్మరసం కంటే గోరువెచ్చని నీళ్లతో తయారుచేసిన నిమ్మ రసం శరీరానికి మరింత ప్రయోజకరణంగా ఉంటుంది. సిట్రస్ పండ్లను తినడం వల్ల రోగనిరోధక శక్తి అధికమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ సి నిమ్మరసంలో పుష్కలంగా ఉంటుంది. దీనితోపాటు విటమిన్ బి,6 ఐరన్ ,పొటాషియం ,క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఇతర పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. గోరువెచ్చని నీటితో నిమ్మరసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్ నీటిని ఒక బౌల్లో తీసుకొని, సగం నిమ్మకాయ ముక్కను ఆ వాటర్ లో వేసి రెండు మూడు నిమిషాలు పాటు బాగా మరగనివ్వాలి, ఆ తరువాత వేడిగా ఉన్న వాటర్ కాస్త చల్లారనిచ్చి ఆ నిమ్మకాయను నీటిలో పిండి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత టెస్ట్ కోసం కొంచెం తేనెను కూడా వేయవచ్చు. నీటిని వడగట్టి తాగవచ్చు. ఇలా గోరువెచ్చని నిమ్మరసం కలిపిన నీటిని తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Hot Limon Water : మీరు ఎప్పుడైనా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగారా…

నిమ్మకాయలో విటమిన్ సి, బి తో పాటు భాస్వరం కూడా ఉంటుంది. ఇది బాడీలో ఆక్సిజన్ లోపాన్ని నివారిస్తుంది. దీనిని తాగడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ లభ్యం అవుతుంది. ఈ కాయల్లో ఉండే పొటాషియం రక్తనాళాలను శుభ్రం పరచడానికి పనిచేస్తుంది. శరీరంలో కొత్త రక్త కణాలు ఏర్పడడానికి కూడా సహాయపడుతుంది. వేడి నీటిలో నిమ్మ ముక్కలను మరిగించి తాగడం వల్ల చర్మం మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి వేడి నీళ్ల నిమ్మరసం చాలా బాగా సహాయపడుతుంది. ఇది పొట్టలోనే కొవ్వును తగ్గించి, బరువును తగ్గించడంలో ఉపయోగపడుతుంది.