Health Benefits : కాకరకాయ చేదు గా ఉండడం వల్ల చాలామంది దీన్ని ఇష్టపడ్డారు. కానీ దీనిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వర్షాకాలంలో కాకరకాయ ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుందో తెలుసుకుందాం. పిల్లల నుండి పెద్దల వరకు ఈ కాకరకాయను తినడానికి ఇష్టపడరు. ఇక వర్షాకాలం మొదలైంది. సీజనల్ వ్యాధులు వెంటాడుతుంటాయి. జలుబు ,దగ్గు, జ్వరం వంటి వ్యాధుల బారిన పడతాం. వర్షాలు పడటం వల్ల నీరు నిల్వ ఉండి ఆ ప్రాంతాలలో దోమలు పెరిగి, డెంగు, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడకుండా రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
వర్షాకాలం లో వెంటనే వండిన ఆహారాన్ని తీసుకోవాలి. నిల్వ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా ,ఫంగస్ చేరి అనేక రకాల వ్యాధులకు గురి అవుతాయి. కాబట్టి వేడి వేడి ఆహారాన్ని తీసుకోవాలి. రోజు మనం తినే భోజనంలో కాకరకాయ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కాకరకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని వైద్య నిపుణులు తెలియజేశారు. కాకరకాయలు అన్నింటిలో కేల్ల పొడువాటి కాకరకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని వైద్య నిపుణులు సూచించారు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ కాకరకాయని వర్షాకాలంలో తీసుకుంటే జలుబు ,దగ్గు వంటి వ్యాధుల నుండి రక్షిస్తుంది. కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. దీంతో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుతుంది.
Health Benefits : వర్షాకాలంలో కాకరకాయ రోజు తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో

కాకరకాయ లో ఉండే చేదు పొట్టలో ఉన్న నులిపురుగులను అంతం చేస్తుంది. రోజు కాకరకాయను తీసుకోవడం వల్ల మన బాడీ లో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కాకరకాయ గుండెజబ్బులకు నివారిణిగా పనిచేస్తుంది. ప్రతిరోజు కాకరకాయ జ్యూస్ ఒక గ్లాసు తీసుకుంటే షుగర్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. తరచుగా కాకర కాయ తినడం వల్ల మలబద్దకం సమస్యలు దూరమవుతాయి. పచ్చి కాకరకాయను పరిగడుపున ఒకటి తింటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. షుగర్ తో బాధపడేవారికి కాకరకాయ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. సీజనల్ వ్యాధులకు గురికాకుండా రోజు 2 కాకరకాయలు తీసుకుంటే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు.