Health benefits : చిరుతిండ్లను ఇష్టపడని వారు ఉండరు. ప్రతి ఒక్కరూ కాస్త ఖాళీ సమయం దొరికితే ఏదో ఒక చిరుతిండిని నెమరువేసుకుంటూ ఉంటారు. అందులో ఒకటే చిక్కి. దీనిని ఇష్టపడని వారు ఉండరు. పిల్లలు అయితే ఇంకా ఎక్కువగా ఇష్టపడుతూ తింటారు. ఈ చిక్కిలో అనేక విలువైన పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్లకు చిక్కి తింటే ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తుంది. అయితే ఈ చిక్కితో కొన్ని సమస్యలకు పుల్ స్టాప్ పెట్టవచ్చు. అవి ఏ సమస్యలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిక్కుల తయారీలో తీపి కోసం పంచదారకు బదులు బెల్లం వాడతారు. దీనిని చక్కెర వ్యాధితో బాధ పడేవారు కూడా తినవచ్చు. బెల్లం లో ఉండే పోషకాలు చాలా సమస్యలను అరికడతాయి. ముఖ్యంగా ఎసిడిటి ఉన్నవారు చిక్కి ని తింటే ఆ సమస్యకు సులువుగా పరిష్కారం చూపవచ్చు. ఉత్తర భారతదేశంలోని వారు సంక్రాంతి పిండి వంటలలో నువ్వుల చిక్కిలను కచ్చితంగా చేస్తారు. నువ్వులతో చేసిన చిక్కిలను తమ బంధుమిత్రులతో పంచుకొని తినటం వారి సాంప్రదాయం. నువ్వులను బెల్లం కలిపి తినడం వలన శరీరంలో వేడి పెరుగుతుంది. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో శరీరంలో వేడిని పెంచుకోవాలంటే ఈ చిక్కిలను తప్పనిసరిగా తినాల్సిందే.
Health benefits : ఆస్తమా, ఎసిడిటీ దూరం కావాలంటే… ఈ స్వీట్ ను తినాల్సిందే.

అలాగే ఆస్తమాతో బాధపడేవారు నువ్వులు, బెల్లంతో కలిపి చేసిన చిక్కి లను తింటే మంచి ఫలితం పొందుతారు. అంతేకాదు, బెల్లం లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బెల్లం లో పల్లీలు, నువ్వులు, డ్రైఫ్రూట్స్ వేసి చిక్కి చేసుకుని తింటే చాలా మంచిది. ఈ చిక్కి వ్యాయామం చేసే వారికి బాగా పనికొస్తుంది. ఈ చిక్కిలను చేసుకోవడం చాలా సులువు. అది ఎలాగంటే, ముందుగా పల్లీలను లేదా నువ్వులను నూనె లేకుండా దోరగా వేయించుకోవాలి. తరువాత గింజల కొలతకు సగం బెల్లం తీసుకొని పాకంలాగా పట్టుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న పల్లీలు లేదా నువ్వులను వేసి వెంటనే ఆయిల్ రాసిన ప్లేట్లో పరుచుకోవాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చిక్కిలు రెడీ..