Health Benefits: ఈ రోజుల్లో గ్రీన్ టీ ,లెమన్ టీ ,అల్లం టీ ,బ్లాక్ టీ ఇలా ఎన్నో రకాల టీలు తాగుతున్నారు. కొన్ని టీలులోఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరికొన్నిటిలతో నష్టాలు ఉన్నాయి. ఏది ఏమైనా సరే టీ లను పరిమితంగా తాగాలి. కానీ చాలామంది ఏమి తీసుకున్న ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. ప్రస్తుత కాలంలో ఆరోగ్యం బాగుండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమి తిన్నా లేదా తాగిన ఆరోగ్యానికి మేలు కలిగేదై ఉండాలి. మరి ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి టీ ఒకటి. అదే జామకులటీ జామకులలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. డయాబెటిస్ ఉన్నవారు రోజు రెండు జామ ఆకులు తినడం వల్ల ఈ సమస్య నుండి కొంచెం ఉపశమనం లభిస్తుంది. అలాగే జామ ఆకులు టీలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. జామ ఆకులు టీ తాగితే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఆరోగ్యంపై శబ్ద వహించేవారు రోజు ఉదయం ఒక కప్పు జామకు టీ తాగాలనుకుంటున్నారు. దీనిలో పోషకాలు అధికంగా ఉండడం వల్ల జామఆకులను సూపర్ ఫ్రూట్ గా చెప్తారు. జామ ఆకుల్లో ఎక్కువ నీరు ఉంటుంది. దీనిలో విటమిన్ సి అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, గుండె ఆరోగ్య కరమైన పోషకాలతో నిండి ఉంటుంది. అలాగే జామ ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వీటిని టీ లలో చేర్చుకోవచ్చు. జామ ఆకుల నుంచి తయారైన టీలలో ఫ్లేవనాయిడ్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి కడుపు, పేగు పరిస్థితులు వాపు అధిక రక్తంలో చక్కెర స్థాయిలు మధుమేహం వ్యాధిగ్రస్తులకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. జామకాయ మరియు జామ ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్లను, అనారోగ్యాలను రాకుండా చేస్తాయి. ఈ ఆకుల్లో ఉండే అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు. చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
Health Benefits : మీరు జామ ఆకుల టీ ఎప్పుడైనా తాగారా… దీనిని తరచుగా తాగారంటే.

హానికరమైన ఫ్రీ రాడికల్ నుంచి చర్మాన్ని కాపాడుతూ ఈ ప్రక్రియను తగ్గిస్తాయి. అంతేకాకుండా జామాకుల టీ యాంటీ మైక్రో బయల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది చర్మంపై ఉన్న మొటిమలను నివారిస్తుంది. అధిక బరువు ఉన్నవారు జామ ఆకులు టీ తీసుకుంటే ఈజీగా బరువు తగ్గగలరు. అంతేకాకుండా ఆకలని అరికడుతుంది. వివిధ రకాల క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది. లైకోపిన్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది క్యాన్సర్ సంభావ్యతను తగ్గిస్తుంది. ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్ని రక్షిస్తుంది. కాబట్టి వివిధ రకాల క్యాన్సర్లను అరికడుతుంది. ఆకుల్లో తగిన పరిమాణంలో పొటాషియం ఉంటుంది. జామకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలోనే చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.