Guppedantha Manasu 7 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 7-September-2022 ఎపిసోడ్ 549 ముందుగా మీ కోసం. రిషి వాళ్ళ ఇంట్లో అందరూ భోజనం చేస్తుండగా, జగతి రిషికి భోజనం వడ్డిస్తూ ఉంటుంది, దానిని చూసి దేవయాని షాక్ అవుతుంది.ఏంటి రిషి ఏమీ అనడం లేదు, సైలెంట్గా ఉన్నాడే అని ఆలోచిస్తూ ఉంటుంది.తర్వాత జగతి వసుధారకి ఫోన్ చేసి, మాట్లాడుతూ ఉంటుంది,ఎగ్జామ్స్ అయిపోయాయి కదా వసుధార ఇప్పుడు ఏమి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. నా జీవితం మీద ఒక స్పష్టత ఉంది మేడమ్,రిషి సార్ కి చెప్పి ఇంటికి ఒకసారి వెళ్ళి రావాలని ఉంది మేడమ్ అని అంటుంది, అలాగే వసు అని మాట్లాడుతూ ఉండగా, ఇంతలో రిషి ఫోన్ చేస్తాడు. రితో ఇంతసేపు మాట్లాడుతున్నావ్ అని అనగానే, ఫోన్ కట్ చేయలేని వాళ్లతో మాట్లాడుతున్నాను సార్ అనగానే, రిషికి అర్థం అవుతుంది, జగతి మేడమ్ తొ మాట్లాడుతుందని, రిషి వసుధారతో అంటాడు.
ఒకసారి మీ ఇంటికి వెళ్లి రావాలి వసుధార అని, ఇలా ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుంటారు, ఒకవైపు మహేంద్ర వాళ్ళ స్నేహితుడు వచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి వెళతాడు,దానిని చూస్తూ తమ వెడ్డింగ్ యానివర్సరీ ఈ వీక్ లోనే ఉంది అని, జగతి, మహేంద్ర కొద్దిసేపు మాట్లాడుతూ ఉండగా, దానిని విన్న గౌతమ్ ఈ విషయం రిషికి చెప్పి, మంచిగా సెలబ్రేషన్స్ చేద్దాము అని అంటూ వుండగా, వీళ్లిద్దరూ ఆపుతారు. వద్దు రిషి ఎలా రియాక్ట్ అవుతాడో అని, ఇదంతా దేవయాని వింటుంది.వసుధార వాళ్ళ రెస్టారెంట్కి దేవయాని వెళ్లి,సాక్షి విషయంలో నేను పొరపాటు పడ్డాను, మంచిది అనుకున్నాను అని కొద్దిసేపు మాట్లాడుతూ, వసుధారతో నాకొక హెల్ప్ కావాలి అని అడుగుతుంది. రిషిని నువ్వే ఎలాగైనా ఒప్పించాలని, జగతి మహేంద్ర ల యానివర్సరీ చెయ్యాలి అని అంటోంది.
Guppedantha Manasu 7 September 2022 Episode : యానివర్సరీ సెలబ్రేషన్స్ చెయ్యడానికి జగతి, మహేంద్రలని వసుధార ఒప్పించగలదా?

తమ ఇంట్లోనే గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నాను, అందుకు నువ్వే రిషిని ఒప్పించగలవు అని వసు తొ అంటుంది.అప్పుడు వసుధార సరే మేడం అని అంటుంది. తరువాత రిషి వసుధార ని డేట్కి తీసుకెళతాడు, డిన్నర్ కి ఒక ప్లేస్ కి తీసుకెళతాడు. ఈ ప్లేస్ చాలా బాగుంది సార్ అని అనగానే, రిషి ఈ లైట్లు, ఈ ప్లేస్, ఆకాశం గురించి మాట్లాడకు, వసుధార నాతో మాట్లాడు అని అంటాడు.వసుధార కి రిషి వడ్డిస్తూ, ఇలా అంటాడు నువ్వు రోజురోజుకి చాలా అందంగా అవుతున్నావు అని, సార్ మీరు నన్ను పొగిడారా అని అంటోంది.వీళ్లు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే రిషిని వసుధార ఒప్పించగలదా, జగతి మహేంద్ర ల యానివర్సరీ సెలబ్రేషన్స్ చెయ్యడానికి,యానివర్సరీ సెలబ్రేట్ చెయ్యాలి అని అనుకున్న దేవయాని, దాని వెనుక ఉద్దేశం ఏంటో రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది.