Jack Fruit : ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో పనసపండు ఒకటని చెప్పవచ్చు. ఈ పండు ఎక్కువగా వేసవికాలంలో లభిస్తుంది. ఈ పండు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఈ పండు చూడటానికి పెద్దగా కనిపిస్తుంది. కానీ అధికంగా విత్తనాలు కలిగి ఉంటా ఉంటాయి. ఈ విత్తనాలలో ఎక్కువగా పిండి పదార్థాలు, ప్రోటీన్లు ఉంటాయి. ఈ పండుని పోషకాల పుట్టగా పరిగణించారు. పోలిక్ యాసిడ్, మెగ్నీషియం ,విటమిన్ ఏ,సీ క్యాల్షియం, వంటి పోషకాలు ఉంటాయి.
అనేక రకాల రోగాలకు ఈ పండు నివారణగా పనిచేస్తుంది.ఈ పండులో విటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల కళ్ళకు మేలు చేసి కంటిలో శుక్లాం, రేచీకటి వంటి కంటి సమస్యలను తగ్గిస్తుంది. మెగ్నీషియం, క్యాల్షియం పనస పండులో అధికంగా ఉంటాయి. కావున ఎముకలను దృఢంగా చేసి బోలె ఎముకల వ్యాధి రాకుండా చేస్తుంది. ఈ ఫ్రూట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది.
Jack Fruit : పనస పండు తినడం వల్ల కలిగే పోషక విలువలు గురించి తెలిస్తే…
జీర్ణక్రియ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. జాక్ ఫ్రూట్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో నీటి శాతం అధికంగా ఉండడం వల్ల చర్మం ముడతలు పడకుండా, పొడి బారనివ్వకుండా చేస్తుంది. అదేవిధంగా బాడీని డిహైడ్రేట్ గురికాకుండా చేస్తుంది.