Viral Video : మూత్రం పోసి కూరగాయలను కడిగి అమ్ముతున్న వ్యాపారి.. ఎక్కడో తెలుసా?

Viral Video : ప్రపంచలో ఎక్కడ ఏం జరిగినా చటుక్కున సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇదివరకు పానీ పూరీ నీళ్లలో మూత్రం పోయడం చూసి ఉంటాం. కుళాయి నీళ్లతో చాయ చేయడంతో, కుళాయి నీళ్లతో పానీ పూరీ నీళ్లు తయారు చేయడం చూశాం. మూత్రం పోసి చేతులు కడుక్కోకుండా అదే చేతితో పానీ పూరీని కస్టమర్లకు సర్వ్ చేయడం చేశాం. కానీ.. ఈ వ్యక్తి మాత్రం చాలా డిఫరెంట్. ఆయన ఏం చేశాడో తెలిస్తే మీరు కంగుతింటారు.

Advertisement
vendor urinates on vegetables before selling them video viral
vendor urinates on vegetables before selling them video viral

తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన యూపీలోని బరేలీలో చోటు చేసుకుంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒక కూరగాయల వ్యాపారి అయి ఉండి ఇలా చేయడం ఏంటంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Advertisement

Viral Video : కూరగాయలపై ఉమ్మేసి, మూత్ర విసర్జన చేసి

బరేలీలోని ప్రేమ్ నగర్ కు చెందిన ఓ కూరగాయల వ్యాపారి తోపుడు బండ్ల మీద కూరగాయలను అమ్మూతూ జీవనం సాగిస్తున్నాడు. అతడు గత 35 ఏళ్ల నుంచి బరేలీలో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. ఈనేపథ్యంలో ప్రేమ్ నగర్ లో తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముతూ అతడు చేసిన వింత ప్రవర్తనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ చోట రోడ్డు మీద ఎవరూ చూడటం లేదనుకొని కూరగాయల మీద ఉమ్మేశాడు. దాని మీద మూత్ర విసర్జన కూడా చేశాడు. దాని పక్కనే కారులో ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటనను రికార్డు చేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. మూత్ర విసర్జన చేసి ఆ కూరగాయలను కడిగి అమ్మడం ఏంటంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement