Health Benefits : రోజు ఒక కప్పు టీ తాగడం వల్ల బాడీ చురుకుదనం, బ్రెయిన్ ఉత్తేజితమవుతుంది. రోజంతా ఎనర్జీ గా ఉండాలంటే ఒక కప్పు లెమన్ టీ ఎంపిక చేసుకోవాల్సిందే. లెమన్ టీ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. లెమన్ టీ తాగడం వల్ల ఒంట్లో ఉన్న ట్యాక్సీన్స్ తొలగిపోతాయి. ఈ టీ రోజు తాగడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.లెమన్ టీ లో విటమిన్ B6 మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి.ఇన్ఫెక్షన్ నుండి ఎలర్జీ వంటి సమస్యలు తగ్గించడంలో లెమన్ టీ బాగా సహాయపడుతుంది. టీలలో మూడు రకాలుగా ఉన్నాయి.
హెర్బల్ టీ,బ్రూటి టీ,లెమన్ టీ వీటన్నింటిలోకెల్లా బరువు తగ్గటానికి లెమన్ టీ బాగా ఉపయోగపడుతుంది. టి ఆకుల్లో ఫ్లావనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో బాగా సహాయపడతాయి. మొటిమలు, మచ్చలు ,తామర వంటి చర్మవ్యాధులను నియంత్రించడంలో లెమన్ టీ బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా తయారు చేస్తుంది. అధిక బరువు తగ్గడంలో నిమ్మకాయ టీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది అనేక రోగ నిరోధక లక్షణాలు కలిగి ఉంటుంది.
Health Benefits : . బోలెడు ప్రయోజనాలు ఉన్నాయా?

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. వివిధ రకాల టెన్షన్లు తగ్గించడానికి ఈ లెమన్ టీ లో ఉండే ప్లావనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, రాగి ,జింక్ ,పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఈ బ్రెయిన్ ని చురుగ్గా ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. లెమన్ టీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఒత్తిడి తగ్గించడానికి ,విశ్రాంతి ఇవ్వడానికి సహాయపడుతుంది. మీరు పాలు లేని ఏ టీ లో అయినా నిమ్మకాయను తీసుకోవచ్చు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అదేవిధంగా బరువు తగ్గాలనుకునేవారు రోజు ఒక కప్పు లెమన్ టీ తాగడం వల్ల ఒంట్లో ఉన్న కొవ్వు తగ్గి ఈజీగా బరువు తగ్గుతారు అనే వైద్య నిపుణులు చెబుతున్నారు