Sai Pallavi Gargi Review : సినిమా పేరు : గార్గి
నటీనటులు : సాయి పల్లవి, ఆర్ ఎస్ శివాజీ, ఐశ్వర్యలక్ష్మి, కాళి వెంకట్
డైరెక్టర్ : గౌతమ్ రామచంద్రన్
సంగీతం : గోవింద్ వసంత్
రన్నింగ్ టైమ్ : 2 గంటల 17 నిమిషాలు
సాయి పల్లవి గురించి తన నటన గురించి, తన డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే తను విరాట పర్వం సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. తన నటనతో అందరినీ ఫిదా చేస్తుంది సాయి పల్లవి. ఏమాత్రం గ్లామర్ ఒలకబోయకుండా.. బెస్ట్ పాత్రలను ఎంచుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప సినిమాల్లో నటించి.. బెస్ట్ హీరోయిన్ అనిపించుకుంటోంది సాయి పల్లవి. విరాట పర్వం తర్వాత సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన సినిమా గార్గి. ఈ సినిమా తమిళంలో తీసినప్పటికీ.. దీన్ని తెలుగులోనూ అనువదించారు. ఈ సినిమా తాజాగా విడుదలైంది. మరి.. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో లేదో తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

Sai Pallavi Gargi Review : కథ
ఈ సినిమాలో టైటిల్ పాత్రను సాయి పల్లవి పోషించింది. సాయి పల్లవి(గార్గి) ఒక స్కూల్ టీచర్. తన తండ్రి పేరు బ్రహ్మానందం(ఆర్ ఎస్ శివాజి). అతడు ఓ అపార్ట్ మెంట్ లో సెక్యూరిటీ ఉద్యోగం చేస్తుంటాడు. అయితే.. అదే అపార్ట్ మెంట్ లో ఓ బాలికపై కొందరు అత్యాచారం చేస్తారు. ఆ కేసులో బ్రహ్మానందాన్ని అరెస్ట్ చేస్తారు. నిజానికి.. ఆ రేప్ కేసుకు, అతడికి ఏ సంబంధం ఉండదు. కానీ.. అతడి మీద అనుమానంతో అరెస్ట్ చేస్తారు. తన తండ్రి ఏ తప్పు చేయలేదని.. తన తండ్రిని బయటికి తీసుకొచ్చేందుకు గార్గి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తుంది. అసలు బాలికను రేప్ చేసింది ఎవరు? ఆ నిందితులను చట్టానికి పట్టి ఇస్తుందా? జూనియర్ లాయర్ గిరీషం(కాళి వెంకట్) పాత్ర ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమాను థియేటర్ లో చూడాల్సిందే.
విశ్లేషణ
ఒకప్పుడు హీరోయిన్ పాత్రలో నటించే సాయిపల్లవి.. ఇప్పుడు తనే ప్రధాన పాత్రలో ఉండే సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది. విరాట పర్వంలోనూ తనే ప్రధాన పాత్రలో నటించిన సినిమా. అలాగే.. గార్గి కూడా అంతే. ఈ పాత్రలో తను ఒదిగిపోయింది. ఒక సాధారణ టీచర్ గా సాయి పల్లవి అదరగొట్టేసింది. ఈ సినిమాలో సాయి పల్లవి తర్వాత అంత స్కోప్ ఉన్న పాత్రలను చేసింది మరో ఇద్దరు. వాళ్లే ఆర్ఎస్ శివాజి, కాళి వెంకట్. వీళ్లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు.. అలాంటి ఘటనల్లో నిజంగా నిందితులకు శిక్ష పడుతోందా? లేక నిర్దోషులకు శిక్ష పడుతోందా అనే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ఇది. అలాగే.. ఈ సినిమాలో మీడియా బాధ్యతను కూడా గుర్తు చేశారు. ఈ సినిమాలో ప్రతిదీ ప్లస్ పాయింటే. సినిమాలో మైనస్ పాయింట్స్ ఏం లేవు.
కన్ క్లూజన్
చివరగా చెప్పొచ్చేదేంటంటే ఇది వన్ ఉమెన్ షో.. అంటే సాయి పల్లవి లేకుంటే ఈ సినిమాను ఊహించుకోలేం. సాయిపల్లవే ఈ సినిమాకు ప్లస్. ఒరిజినాలిటీకి దగ్గరగా ఉండే సినిమా. సామాన్య ప్రజలు తమకు ఏదైనా కష్టం వస్తే.. లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటే ఎలా వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు.. అనేదే ఈ సినిమా.
యువతరం రేటింగ్ : 3/5