Health benefits : ఈ మల్బరీ పండ్లకు మరో పేరు బొంత పండ్లు అని పిలుస్తారు. చాలామంది పట్టుపురుగుల పెంపకం లో మల్బరీ ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనికోసం మల్బరీ చెట్లను నాటుతున్నారు. మల్బరీ పండ్లు ఎరుపు, తెలుపు, పర్పుల్ రంగులను కలిగి ఉంటాయి కలిగి ఉంటాయి.ఇవి పులుపు, తీపీ రుచులతో ఈ పండ్లు తినడానికి చాలా మంది ఇష్టపడతారు. షర్బతలు, జల్లిలు వంటి వాటిల్లో ఉపయోగిస్తారు. మల్బరీ పండ్లలో అనేక ఔషధ, పోషక గుణాలు కలిగి ఉన్నాయి. వీటిని ఇతర దేశాలలో మూలికావైద్యం లో గుండె జబ్బులు, షుగర్, రక్తహీనత చికిత్సలకు మల్బరీ పండ్లను వాడుతున్నారు.
మల్బరీ పండ్లు తినడం వల్ల డయాబెటిస్ తో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అందుకే మల్బరీ పండ్లను పోషకాల పుట్ట అని అంటారు. మల్బరీ పండ్లు అనేక ఔషధ, పోషక గుణాలు కలిగి ఉన్నాయి. మల్బరీ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, ఫినాలిక్ ఆమ్లాలు , మెగ్నీషియం, ఐరన్ క్యాల్షియం విటమిన్ A, k లు కలిగి ఉన్నాయి. ఈ పండ్లలో విటమిన్-సి ఎక్కువగా ఉండడం వల్ల బాడీలో రోగనిరోధకశక్తిని పెంచి. చిగుళ్ల సమస్యలను దూరం చేస్తాయి . చర్మం మెరిసేలా కాంతివంతంగా చేయడంలో ఉపయోగపడతాయి. వీటిలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంటిచూపును మెరుగు పరుస్తుంది.
Health benefits : మల్బరీ పండు యొక్క ప్రయోజనాలు

అధిక వయస్సు ఉన్నవారికి తక్కువ వయసు లా కనిపించేలా చేస్తాయి. చర్మంపై నల్లటి మచ్చలు, ముడతలను తగ్గించి అందంగా ఉండేలా చేస్తాయి. జుట్టు రాలే సమస్య లను అదుపు చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మల్బరీ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్దక, గ్యాస్, ఉబ్బసం, సమస్యలతోపాటు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయి. మల్బరీ పండ్లు రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గి. డయాబెటిస్ వల్ల వచ్చే సమస్యలను దూరం చేస్తాయి. మల్బరీ పండ్లలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తకణాలను పెంచి శరీర కణాలకు త్వరగా ఆక్సిజన్ విడుదల చేస్తాయి. శరీరంలో ఫ్రీరాడికల్స్ జరిగి క్యాన్సర్ సమస్యలను దూరం చేస్తాయి.