Health Tips : మన పూర్వీకులు అన్నం కంటే ఎక్కువగా గంజిని తాగేవారు. అందుకే వారు బలంగా,ధృడంగా వుండేవారు. ఎంత పెద్ద పనిని అయినా,ఎంతసేపు అయిన చేయగలిగేవారు. ఇప్పటివారికి గంజి అంటే ఏంటో తెలియదు. అసలు గంజి దేని నుంచి వస్తుందో కూడా తెలియదు. అంతా కొత్త కొత్త వెరైటీలు చేస్తూ,పాత సాంప్రదాయాన్ని పూర్తిగా మరిచిపోతున్నారు. అందుకే కొత్త కొత్త రోగాల బారిన పడుతున్నాం. అన్నం వండేటప్పుడు ఎక్కువ నీరు పోసి వండితే గంజి వస్తుంది. ఈ గంజి తాగడం వలన చాలా లాభాలు వున్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
వానాకాలంలో కలుషిత నీరు తాగడం వలన ఎక్కువమంది అతిసారం వ్యాధి బారిన పడుతుంటారు. ఈ అతిసారం వలన వాంతులు, విరోచనాలు అవుతూ వుంటాయి. ఈ వ్యాధి కారణంగా మన శరీరంలో నీరు శాతం తగ్గుతుంది. డీహైడ్రేషన్ బారిన పడుతాం. అతిసారం వ్యాధి వలన మన బాడీలో ఖనిజ,లవణాలు తగ్గిపోయి, బలహీనపడతాం. అలాంటి సమయంలో ఈ గంజిని తాగితే బలం వస్తుంది.ఈ గంజిని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి…
Health Tips : గంజి నీరుతో చాలా లాభాలు

అన్నం వండుకునేటప్పుడు బియ్యంలో ఎక్కువ నీళ్లు పోసుకొని వండుకోవాలి. అన్నం సగం ఉడుకు పట్టాక గంజి నీళ్లు వస్తాయి. ఆ నీళ్లను ఒక గిన్నెలోకి ఒంపుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపి తాగితే,శరీర బలహీనతను పోగొడుతుంది. ఈ గంజిలో ఖనిజ లవణాలు అధిక మొత్తంలో వుంటాయి. కనుక ఇవి మన బాడీకి బలాన్ని చేకూరుస్తాయి.ఈ గంజినీళ్లు అతిసారం వ్యాధిని తగ్గించడానికి బాగా పనిచేస్తాయి.వీటిని ఎండాకాలంలో కూడా తాగవచ్చు. మన బాడీని డీహైడ్రేషన్ కాకుండా చూసుకుంటుంది.